సాధారణంగా కిడ్నాపర్లు(Kidnappers) ఎలా ఉంటారు.
సాధారణంగా కిడ్నాపర్లు(Kidnappers) ఎలా ఉంటారు. పిల్లలనో మరెవరినో కిడ్నాప్ చేసినవారి తల్లిదండ్రులకు, బంధువులకుఫోన్ చేసి బెదిరిస్తాడు. అడిగిన డిమాండ్లకు ఒప్పుకోకుంటే కొన్ని సందర్భాల్లో తాము కిడ్నాప్‌చేసిన వారిని చంపిన సందర్భాలున్నాయి కూడా. ఓ బాలుడిని నెలల సమయంలో ఉన్నప్పుడు కిడ్నాప్ చేశాడు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 14 నెలల తర్వాత కిడ్నాపర్ పోలీసులకు దొరికిపోయాడు. దీంతో కిడ్నాపర్ చెర నుంచి బాలుడిని విడిపించే సమయంలో హృదయాలను హత్తుకునే సన్నివేశం ఏర్పడింది. కిడ్నాపర్‌ను వీడలేక బాలుడు, బాలుడిని వీడలేక కిడ్నాపర్ కన్నీటిపర్యంతమయ్యారు. కిడ్నాపర్ నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లనని బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన తనూజ్ చాహర్(Thanuj Chahar) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. విధులు సరిగా నిర్వర్తించకపోవడంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద తనూజ్‌ను సస్పెండ్ చేశారు. దీంతో మందుకు బానిసైన తనూజ్ రాజస్తాన్‌కు చెందిన పృథ్వి అనే పసిబిడ్డను నెలల సమయంలోనే కిడ్నాప్ చేశాడు. దీంతో తమ బాబును ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు చిక్కకుండా తనూజ్ వేషాలు, స్థావరాలు మారుస్తూ వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతున్నాడు. దాదాపు 14 నెలల తర్వాత తనూజ్, బిడ్డను పోలీసులు కనిపెట్టారు. బాలుడిని, తనూజ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలుడి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తల్లిదండ్రులను బాలుడు గుర్తించకపోగా వారి వద్దకు వెళ్లేందుకు మారాం చేశాడు. గుక్కపట్టి ఏడ్చాడు. 14 నెలలపాటు చిన్నారిని కన్నబిడ్డలా సాదిన కిడ్నాపర్ తనూజ్ కూడా బాలుడిని విడిచిపెట్టలేక కన్నీటిపర్యంతమయ్యాడు. అయితే పోలీసులు బలవంతంగా బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.