మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) దారుణాతిదారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి(sexual assault) జరిగింది. పాపం ఆ బాలిక అర్థ నగ్నంగా(Half Nude), తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధులలో ఇంటింటికి తిరుగుతూ బతిమాలుకుంది. కాపాడమని వేడుకుంది. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా చీత్కారం ఆ పాపకు ఎదురయ్యింది. మానవత్వానికి మాయనిమచ్చలా, సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) దారుణాతిదారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి(sexual assault) జరిగింది. పాపం ఆ బాలిక అర్థ నగ్నంగా(Half Nude), తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధులలో ఇంటింటికి తిరుగుతూ బతిమాలుకుంది. కాపాడమని వేడుకుంది. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా చీత్కారం ఆ పాపకు ఎదురయ్యింది. మానవత్వానికి మాయనిమచ్చలా, సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లైంగిక దాడి అనంతరం అర్ధనగ్నంగా, ప్రైవేటు భాగాల నుంచి తీవ్ర రక్తస్రావంతో బాధిత బాలిక దాదాపు రెండు గంటల పాటు ఇంటింటికీ వెళ్లి సాయం చేయాలని వేడుకుంది. ఏడుస్తూ మొరపెట్టుకుంది. కన్నీరోడుస్తున్న ఆ ఆమాయకపు పాప మొహాన్ని చూసి కూడా స్థానికులు స్పందించలేదు. చిన్నారికి వచ్చి కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. బాలికను చూసిన కొందరు పొమ్మంటూ సైగలు కూడా చేయడం కూడా వీడియో కనిపించింది.
చివరకు ఓ ఆశ్రమం వద్దకు బాలిక చేరుకోగా, ఆమె లైంగిక దాడికి గురైనట్టు రాహుల్‌ శర్మ అనే పూజారి గమనించి ఆమెకు దుస్తులు అందించాడు. బాధితురాలు నిస్సహక స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆమెను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక లైంగిక దాడికి గురైనట్టు వైద్యులు ధ్రువీకరించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. బాధితురాలు ఎక్కడ లైంగిక దాడికి గురైందనే దానిపై స్పష్టత లేదు. సోమవారం ఉజ్జయినిలోని(Ujjain) మహాకల్‌ పోలీసుస్టేషన్‌(Mahakal Police Station) ఏరియాలో బాలిక రక్తపు మడుగులో కనిపించిందని ఉజ్జయిని ఎస్పీ సచిన్‌ శర్మ(Sachin Sharma) తెలిపారు. బాధిత బాలిక యూపీకి(UP) చెందిన ప్రయాగ్‌రాజ్‌ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్‌తోపాటు(Auto Driver) మరోముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసిన ఆటో డ్రైవర్‌ను రాకేశ్‌గా గుర్తించారు. బాధితురాలు జీవన్‌ఖేరి దగ్గర అతడి ఆటోనే ఎక్కిందని సీసీటీవీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. ఆటోను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపించారు. అరెస్ట్‌ అయిన ముగ్గురూ ఆటో డ్రైవర్లేనని పోలీసులు చెబుతున్నారు.
అత్యాచార బాధితురాలిని కాపాడిన పూజారి రాహుల్ శర్మ ఆ బాలిక ఎదుర్కొన్న భయానక స్థితిని తెలిపారు. 'సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర రక్తస్రావంతో అర్ధనగ్నంగా ఉన్న బాలికను గమనించారు. ఆమెకు తన బట్టలు ఇచ్చాను. రక్తం కారుతూ, కళ్ళు వాచిపోయాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. వెంటనే 100కి కాల్ చేశాను. మహంకాల్‌ పోలీసులు 20 నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాలిక తమతో ఏదో చెప్పిందుకు ప్రయత్నిస్తుంటే మాకు అర్థం కాలేదు. ఆమె పేరు, కుటుంబం గురించి ఆరా తీశాము. ఆమె సుక్షితంగా ఉందని, తనను జాగ్రత్తగా ఇంటి వద్దకు చేరుస్తామని భరోసా ఇచ్చాను. కానీ ఆమె చాలా భయపడుతూ కనిపించింది. బాలిక కేవలం మమ్మల్ని మాత్రమే నమ్మింది. వేరే వాళ్లు ఆమె వద్దకు వచ్చినప్పుడు భయపడి నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. చివరికి పోలీసులు వచ్చి ఆమెను తమతో తీసుకెళ్లారు’ అని రాహుల్ శర్మ(Rahul Sharma) తెలిపారు

Updated On 28 Sep 2023 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story