పెళ్లి బరాత్‌లో(Marriage Barath), ఊరేగింపులలో పెద్ద పెద్ద విద్యుద్దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉంటారు కొందరు.

పెళ్లి బరాత్‌లో(Marriage Barath), ఊరేగింపులలో పెద్ద పెద్ద విద్యుద్దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉంటారు కొందరు. సాధారణంగా ఇంత బరువైన వాటిని మగవాళ్లే ఎత్తగలరు. కానీ పొట్ట తిప్పల కోసం మహిళలు, పిల్లలు కూడా దీపాలను మోస్తూ ఉంటారు. ఆ దృశ్యాలు మనల్ని కదిలిస్తాయి. సాయం చేద్దామంటే ఫాల్స్‌ ప్రిస్టేజ్‌ అడ్డుతలుగుతుంటుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అలా అనుకోలేదు. మానవత్వం అప్పుడప్పుడు ఇలాంటి వ్యక్తుల కారణంగా పరిమళిస్తుంటుంది. అసలు ఏం జరిగిదంటే తన ఫ్రెండ్‌ కొడుకు పెళ్లి వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణిని(Pregnant) చూశాడు తన్వీర్‌ మహ్మద్‌. ఆమెను చూడగానే తల్లి గుర్తుకొచ్చినట్టు ఉంది అతడికి! వెంటనే ఆమె నెత్తి మీద ఉన్న దీపాన్ని తను తీసుకున్నాడు. నెత్తిపై పెట్టుకున్నాడు. బరాత్‌ కారు వెంట నడవసాగాడు. తన్వీర్‌ చూసిన అతడి స్నేహితులు కూడా వంతులవారీగా ఆమె బరువును మోశారు. తన్వీర్‌ మిత్రులందరూ కలిసి దీపాలు మోసిన బృందానికి చెల్లించేదాని కంటే రెండు రెట్లు ఎక్కువే ఇచ్చారట! ఈ వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన తన్వీర్‌ తల్లిని మించిన హీరో లేరు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తన్వీర్‌ చేసిన మంచి పనిని మెచ్చుకున్నారు. అభినందించారు

Eha Tv

Eha Tv

Next Story