అక్బర్ అనే పేరున్న మగసింహం(male Lion), సీత అనే పేరు కలిగిన ఆడ సింహం(Female lion) ఒకే ఎన్‌క్లోజర్‌లో(Enclosure) ఉన్నాయి. ఠాట్ అలా ఎలా ఉంచుతారని విశ్వహిందూ పరిషత్ అగ్గి మీద గుగ్గిలయ్యింది. ఆ మంట చల్లారకముందే కోర్టును ఆశ్రయించింది. అటవీశాఖ చేసిన ఈ చర్య వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నది విశ్వహిందూ పరిషత్ అభిప్రాయం. అక్బర్‌ను, సీతను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
అక్బర్ అనే పేరున్న మగసింహం(male Lion), సీత అనే పేరు కలిగిన ఆడ సింహం(Female lion) ఒకే ఎన్‌క్లోజర్‌లో(Enclosure) ఉన్నాయి. ఠాట్ అలా ఎలా ఉంచుతారని విశ్వహిందూ పరిషత్ అగ్గి మీద గుగ్గిలయ్యింది. ఆ మంట చల్లారకముందే కోర్టును ఆశ్రయించింది. అటవీశాఖ చేసిన ఈ చర్య వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నది విశ్వహిందూ పరిషత్ అభిప్రాయం. అక్బర్‌ను, సీతను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటన బెంగాల్‌లో(Bengal) జరిగింది. సిలిగురి సఫారీ పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లో ఈ విధంగా సింహాలను ఉంచారు. ఈ చర్య హిందూ మతాన్ని అవమానించడమేనని, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తూ కోల్‌కతా హైకోర్టును(Kolkata High Court) ఆశ్రయించింది. తక్షణమే ఆడ సింహం పేరును మార్చాలని కోరుతూ జల్పాయిగురి బెంచ్‌లో ఫిబ్రవరి 16వ తేదీన పిటిషన్ వేసింది. మరోవైపు బెంగాల్ అటవీ శాఖ దీనిపై స్పందించింది. మగ, ఆడ సింహాలను త్రిపురలోని సెపాహిజాలా జూలాజికల్ పార్క్ నుంచి నుంచి సిలిగురిలోని సఫారీ పార్క్‌కు ఇటీవల తరలించినట్లు తెలిపింది. వాటిని ఇక్కడకు తీసుకురాక ముందు నుంచే అక్బర్, సీత పేర్లు ఉన్నాయని చెప్పింది. తాము కొత్తగా ఎలాంటి పేర్లు పెట్టలేదని బెంగాల్ అటవీశాఖ చెబుతోంది.