IMD Summer 2024 Updates : ఈ వేసవిలోనూ సూర్యుడు నిప్పులు కక్కుతాడు! ఈ నెల చివర్లోనే మండే ఎండలు
ఈ ఏడాది కూడా వేసవిలో(Summer) చండ్రనిప్పులబారిన పడే ప్రమాదం ఉంది. ఈ భూమ్మీద ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిన 2023లాగే ఈ ఏడాది కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఈ ఏడాది కూడా వేసవిలో(Summer) చండ్రనిప్పులబారిన పడే ప్రమాదం ఉంది. ఈ భూమ్మీద ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిన 2023లాగే ఈ ఏడాది కూడా ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వేసవిలోనూ అత్యంత వేడి ఉంటుందని వాతావరణ శాఖ(IMD) అధికారులు చెబుతున్నారు. ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమెట్(The Provisional State of the Global Climate) నివేదికలో ఈ విషయం తేలింది. నిరుడు వేసవిలో ఎల్‌నినో(El Nino) ప్రభావం లాగే ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు అలుముకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్లే సాధారణ ఉష్ణోగ్రతల్లో(Temperatures) మార్పులు చోటు చేసుకున్నట్టు పేర్కొంది. గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి చివరివారం నుంచే ఎండలు మండిపోతాయని, మార్చి 20 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.