Varun Gandhi : వరుణ్ గాంధీవైపు చూస్తున్న అమేథి ఓటర్లు
సార్వత్రిక ఎన్నికలకు(General Elections) సమయం దగ్గరపడింది. రాజకీయాలలో అప్పుడే ఎన్నికల వేడి పెరిగింది. ర్యాలీలు, సభలలో నేతలు బిజీ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. రాయబరేలీలో ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయ్యింది. అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేకపోతే వాయనాడ్‌కే మొగ్గుచూపుతారా అన్నది తేలాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు(General Elections) సమయం దగ్గరపడింది. రాజకీయాలలో అప్పుడే ఎన్నికల వేడి పెరిగింది. ర్యాలీలు, సభలలో నేతలు బిజీ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. రాయబరేలీలో ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయ్యింది. అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేకపోతే వాయనాడ్‌కే మొగ్గుచూపుతారా అన్నది తేలాల్సి ఉంది. కిందటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నుంచి రాహుల్‌గాంధీ(Rahul Gandhi) పోటీ చేశారు. అమేథిలో ఓటమిపాలైన రాహుల్ వాయనాడ్‌లో మాత్రం ఘన విజయం సాధించారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ ఆమేథి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారని వినికిడి. గాంధీ కుటుంబానికి విధేయత చూపించే అమేథి ప్రజలు ఇప్పుడు వరుణ్ గాంధీవైపు(Varun Gandhi) చూస్తున్నారట! 2019లో అమేథీ నుండి బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఇప్పుడామెకు అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దివంగత సంజయ్ గాంధీ 1980లో అమేథీ లోకసభ స్థానాన్ని గెలుచుకోవడంతో గాంధీ కుటుంబానికి అమేథీతో(Amethi) అనుబంధం ఏర్పడింది. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అంగీకరించకపోతే వరుణ్ గాంధీ అమేథీ నుండి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇదేగానీ జరిగితే, తామంతా వరుణ్‌కు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. వరుణ్‌గాంధీకి బీజేపీ(BJP) అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వరుణ్‌గాంధీ గత కొంతకాలంగా పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వరుణ్‌తో పాటు ఆయన తల్లి మేనకగాంధీకి(Maneka Gandhi) కూడా బీజేపీ అధినాయకత్వం టికెట్ ఇవ్వకపోవచ్చు. మేనక, వరుణ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతారా అన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో వరుణ్‌గాంధీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ అతనికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నయనే వార్తలు వినిపిస్తున్నాయి.