భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాంమాధవ్‌ పేరు చక్కర్లు కొడుతోంది.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాంమాధవ్‌ పేరు చక్కర్లు కొడుతోంది. రాంమాధవ్‌ (Ram Madhav)తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఏపీ(Ap)లోని అమలాపురం(Amalapuram) ఆయన సొంత ప్రాంతం. ఆయనకే ఈ జాతీయ స్థాయి పదవి దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం కలిగిన వ్యక్తి, బీజేపీ కోసం నిబద్ధతతో పనిచేసి గుర్తింపు పొందారు. జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)లో 2014లో బీజేపీ పీడీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు ఇక 2024లో జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లోనూ తనదైన శైలిలో పనిచేసి బీజేపీకి 29 సీట్లు రావడానికి కారణం అయ్యారు. రాంమాధవ్‌ 1981లో ఆర్ఎస్ఎస్‌లో చేరారు. అందులోనే సుదీర్ఘ కాలం పనిచేస్తూ వచ్చారు.2014లో బీజేపీలో చేరి వివిధ హోదాలలో పనిచేశారు. వారణాసి రామ్ మాధవ్ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఆర్ఎస్ఎస్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. వారణాసి రామ్ మాధవ్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. ఇటీవలే నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి వెళ్లిన ప్రధాని మోడీ కూడా ఈ విషయంపై చర్చించారట. మోడీ, అమిత్ షాకు ఆయున అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. చాలా రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక చేపట్టాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్ మాత్రం సంఘ్‌కి చెందిన వ్యక్తికే పగ్గాలు అప్పగించాలని పట్టుబడుతోంది. జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా గత పది నెలలుగా కొత్త బాధ్యతలు మోస్తున్నారు. దాంతో పూర్తి కాలం బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం చూస్తోంది. తొలుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జాతీయస్థాయి అధ్యక్షుడి బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా కేంద్రమంత్రిగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. హర్యాన, మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ ఘన విజయాల వెనక ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధమైన పనితీరు ఉంది. దేశంలో జమిలి ఎన్నికలకు వస్తాయని.. అందుకు బీజేపీ కూడా సంసిద్ధంగా ఉన్నఈ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌(RSS) సహకారం తప్పనిసరికానుంది. దీంతో ఆర్ఎస్ఎస్ మనిషి అయిన వారణాసి రామ్ మాధవ్ పేరుని బీజేపీ పెద్దలు కూడా ఓకే చేశారన్న చర్చ నడుస్తోంది.

ehatv

ehatv

Next Story