ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఓ చిత్రమైన నిర్ణయం తీసుకుంది. వారణాసిలోని(Varanasi) కాశీ విశ్వనాథ ఆలయంలో దగ్గర విధులు నిర్వర్తింఏ పోలీసులు ఇకపై ఖాకీ దుస్తులు(Uniform) వేసుకోకూడదని చెప్పింది. వారికి ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్ ప్రకటించింది. వారు సంప్రదాయ దుస్తులలో అంటే ధోతీ-కుర్తాలు ధరించాలని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఓ చిత్రమైన నిర్ణయం తీసుకుంది. వారణాసిలోని(Varanasi) కాశీ విశ్వనాథ ఆలయంలో దగ్గర విధులు నిర్వర్తింఏ పోలీసులు ఇకపై ఖాకీ దుస్తులు(Uniform) వేసుకోకూడదని చెప్పింది. వారికి ప్రభుత్వం కొత్త డ్రెస్‌కోడ్ ప్రకటించింది. వారు సంప్రదాయ దుస్తులలో అంటే ధోతీ-కుర్తాలు ధరించాలని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఆలయ ప్రాంగణం దగ్గర విధులలో ఉన్న పోలీసులు(Police) కాషాయం రంగు ధోతీ-కుర్తా(Dhoti kurtha) ధరించారు. మెడలో ఓ రుద్రాక్షమాల కూడా వేసుకున్నారు. తీవ్ర వివాదం రేపిన ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకులలాగ సంప్రదాయదుస్తులను ధరించాలని ఏ పోలీసు మ్యానువల్‌లో ఉందని అడిగారు. ఇలాంటి పిచ్చి ఉత్తర్వులు ఇచ్చిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిని అవకాశంగా తీసుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే, ప్రజలను దోపిడీ చేస్తే? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. యోగి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కమిషనర్ మోహిత్ అగర్వాల్ మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించారు.
‘మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆలయాల్లో విధి నిర్వహణ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ భక్తుల రద్దీ ఎంత ఉన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగదు. అయితే భక్తులకు త్వరగా దర్శనం కల్పించడానికి ఒక్కోసారి కఠినంగా వ్యహరించవచ్చు. అయితే వారు అర్చకుల లాగా కనిపిస్తే భక్తులు సానుకూల దృష్టితో చూసే అవకాశం ఉంటుంది. అందుకే పోలీసులకు ఖాకీలకు బదులుగా ధోతీ-కుర్తా ఇస్తున్నాం' అని అన్నారు.