జ్ఞానవాపి మసీదులో(Gnanavapi Masjid) భారత పురావస్తు సర్వే(Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తయ్యింది. అయితే నివేదికను సమర్పించడానికి ఎఎస్‌ఐ గడువు కోరడంతో నవంబర్‌ 17వ తేదీ వరకు వారణాసి కోర్టు(Varanasi court) సమయం ఇచ్చింది.

జ్ఞానవాపి మసీదులో(Gnanavapi Masjid) భారత పురావస్తు సర్వే(Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తయ్యింది. అయితే నివేదికను సమర్పించడానికి ఎఎస్‌ఐ గడువు కోరడంతో నవంబర్‌ 17వ తేదీ వరకు వారణాసి కోర్టు(Varanasi court) సమయం ఇచ్చింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి ఏఎస్ఐకి కోర్టు మరింత గడువు ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు సమయం ఇస్తూ వారణాసి జిల్లా న్యాయమూర్తి కె.విశ్వేష్‌(K.Vishwesh) ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు సర్వే నివేదికను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి సమయం కోరిందని, అందుకు కోర్టు అంగీకరించిందని ప్రభుత్వ న్యాయవాది అమిత్‌ శ్రీవాత్సవ తెలిపారు.

Updated On 2 Nov 2023 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story