రైల్లో సీట్ల కోసం గొడవపడడం తరచుగా చూసి ఉంటాం. కానీ వందే భారత్ రైలులో మాత్రం ఆహారం విషయంలో గొడవ జరిగింది.

రైల్లో సీట్ల కోసం గొడవపడడం తరచుగా చూసి ఉంటాం. కానీ వందే భారత్ రైలులో మాత్రం ఆహారం విషయంలో గొడవ జరిగింది. జులై 26న శాఖాహార ప్రయాణీకుడికి మాంసాహారం వడ్డించిన ఘటన వెలుగులోకి వ‌చ్చింది. మాంసాహారం రావ‌డంతో ఆగ్రహించిన ప్రయాణికుడు రైలులో పెద్ద దుమారాన్ని సృష్టించాడు.

వైరల్ వీడియో ప్రకారం.. వెజిటేరియన్ ప్రయాణీకుడికి పొరపాటున ఒక వెయిటర్ మాంసాహారాన్ని ఇచ్చాడు. ఫుడ్ ప్యాకెట్ పై మాంసాహారం చిహ్నాన్ని పట్టించుకోకుండా ప్రయాణికుడు ఆహారం తిన్నాడు. తిన్న తర్వాత ఆ ఆహారం శాఖాహారం కాదని.. మాంసాహారమని గ్రహించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ప్రయాణికుడు సిబ్బందిని చెంపదెబ్బ కొట్టాడు. ప‌క్క‌నున్న ప్రయాణికులు సిబ్బందిని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదులో రైలులోని సహ-ప్రయాణికులు పోలీసుల ముందు వెయిటర్‌కి క్షమాపణ చెప్పమని ఆ వ్యక్తిని అడిగారు. ఇంతలో వెయిటర్‌ను ఆ వ్యక్తి చెప్పుతో కొట్టాడని మరో ప్రయాణికుడు ఆరోపించాడు. అయితే ఆ వ్య‌క్తి క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోగా వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Eha Tv

Eha Tv

Next Story