చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం(Vaishaka Masam) అంటారు.
మాసాల్లో వైశాఖం రెండో మాసం కావడం. అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. వరుస పర్వదినాలు, విశేష పూజాది కార్యక్రమాలు, దానధర్మాలకు() అనువైన కాలం. ఇలా అన్నీ కలిసిన మాసం ఏదయినా ఉందంటే అది వైశాఖమే. మాధవ మాసంగానూ పిలిచే ఈ వైశాఖం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి.

చైత్రం తరువాత వచ్చే రెండో మాసమే వైశాఖం. చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు వైశాఖమనే పేరు వచ్చింది. ఈ మాసంలో లక్ష్మీదేవి సమేత మహావిష్ణువును తులసీదళాలతో పూజిస్తే మంచిది. వైశాఖం మొదలుకొని మరో మూడు నెలల వరకూ మహావిష్ణువు భూ సంచారానికి వస్తాడనీ అందుకే ఈ నెలలో స్వామి ఆరాధన సర్వ శుభాలనూ కలిగిస్తుందనీ చెబుతారు. శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన మాసాల్లో వైశాఖం కూడా ఒకటి కావడం వల్ల ఈ నెలను మాధవ మాసంగానూ(Madhava Masam) పిలుస్తారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో వచ్చే వరుస పర్వదినాలు వివిధ దేవతారాధనలను సూచిస్తాయి.వైశాఖ శుక్ల తదియనాడు కృతయుగం ప్రారంభమైందని పురాణ ప్రవచనం. విష్ణుమూర్తి పరశురాముని అవతారాన్ని ధరించిన ఈ రోజును పరశురామ జయంతిగా పరిగణిస్తారు.
అక్షయ తృతీయగానూ(Akshaya Tritiya) పరిగణించే ఈ పర్వదినం ఈ రోజే! సింహాచల క్షేత్రంలోని శ్రీలక్ష్మీ వరాహనృసింహుడి నిజరూపాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజున స్వామిపైన ఉన్న చందనం పూతను పూర్తిగా తొలగించి అభిషేక, పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం కేవలం కొద్దిగంటలు మాత్రమే స్వామి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తారు. చందనోత్సవంగా పిలిచే ఈ వేడుకను చూసేందుకూ, స్వామిని దర్శించుకునేందుకూ సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక, అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి శక్తికొలదీ దానధర్మాలు చేయడం, బంగారం కొనుగోలు చేయడం వల్ల అక్షయమైన సిరిసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే బద్రీనాథ్ లోని ఆలయం తలుపులు తెరుస్తారు.