దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు లేవు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు లేవు. ప్రభుత్వ పథకాలేవీ అందడం లేదు. సంక్షేమం గురించి చెప్పనే అక్కర్లేదు. మహారాష్ట్రలోని(Maharashtra) నాందేడ్‌(Nandhed) జిల్లా కిన్వాట్‌(Kinwat) తాలూకాలోని వాగ్దారి(Vadhghari) గ్రామం ఇలాంటిదే! ఈ ఊళ్లో 300 జనాభా ఉంది. కాకపోతే భూ రెవెన్యూ మ్యాపులలో(Revenue Map) ఈ గ్రామం పేరు లేదు. అందుకే ఈ గ్రామ ప్రజలు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు. ఇప్పుడా సమస్య లేదు. గ్రామంలో పోలింగ్‌ బూత్‌(Polling booth) ఏర్పాటు కానుంది. ఈ నెల 20వ తేదీన జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో(Maharashtra assembly elections) ఈ గ్రామ ప్రజలు మొదటిసారి తమ ఊరిలోనే ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు దగ్గరలో ఉన్న జలధారకు వెళ్లి ఓటు వేసేవారు. వాగ్దారి నుంచి జలధారకు వెళ్లడానికి రెండు గంటలు పడుతుంది. పైగా అడవి నుంచి వెళ్లాలి. క్రూర మృగాల భయం ఒకటి. అయితే కిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో గ్రామ ప్రజలు సంతోషిస్తున్నారు. గ్రామానికి పోలింగ్‌ బూత్‌ వస్తున్నదంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా కలుగుతాయని గ్రామస్తులు అనుకుంటున్నారు. తమ కనీస అవసరాలు తీరతాయని నమ్ముతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story