ఉత్తరాఖండ్‌లోని(Utharkhand) ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్‌లో(Silkayara) చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. వారిలో ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) మీర్జాపూర్(Mirzapur) నివాసి అఖిలేష్ కుమార్(Akilesh Kumar) కూడా ఉన్నారు. ఆయన బయటకు వస్తున్నాడని తెలియగానే ఆయన కుటుంబంలో ఆనందం వచ్చింది. గత 17 రోజులుగా వారు చేయని పూజ లేదు. దర్శించని ఆలయం లేదు.
ఉత్తరాఖండ్‌లోని(Utharkhand) ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్‌లో(Silkayara) చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. వారిలో ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) మీర్జాపూర్(Mirzapur) నివాసి అఖిలేష్ కుమార్(Akilesh Kumar) కూడా ఉన్నారు. ఆయన బయటకు వస్తున్నాడని తెలియగానే ఆయన కుటుంబంలో ఆనందం వచ్చింది. గత 17 రోజులుగా వారు చేయని పూజ లేదు. దర్శించని ఆలయం లేదు. సొరంగంలో చిక్కుకున్న ప్రతీ ఒక్కరు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ పలు ప్రాంతాల్లో పూజలు చేశారు. వారి పూజలు ఫలించాయి. మంగళవారం కార్మికులందరిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అఖిలేశ్ తల్లి మోహంలో అయితే సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది. 'ఈ రోజు మాకు ఆనందకరమైన రోజు. మేము రేయింబవళ్లు దేవుడిని ప్రార్థించాం. దేవుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాను' అని తెలిపారు. తన కొడుకు సొరంగం నుంచి బయటపడిన ఆనందంతో ఇరుగుపొరుగు వారికి స్వీట్లు పంచారు. తన కుమారుడికి పునర్జన్మ లభించిందని అంటున్నారు. అఖిలేశ్ తండ్రి కూడా ఇవాళ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అన్నారు. గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.'దేవుడు కరుణించి మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి లేకుండాపోయింది. ఇప్పుడు మేము దీపావళి పండుగను సంబరంగా చేసుకుంటాం. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని తెలిపారు. మంగళవారం రాత్రి 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఒక్కొక్కరుగా కార్మికులంతా బయటకు వచ్చారు. అందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు.