ఉత్తరాఖండ్‌(Uttarakhand) ఉత్తరకాశీలోని(Uttarkashi) సొరంగంలో(Tunnel) చిక్కుకున్న 40 మంది కార్మికుల(Workers) పరిస్థితి దయనీయంగా మారింది. అయిదు రోజుల కిందట సొరంగం కూలీలు అందులో చిక్కుకుపోయారు. అయిదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క కార్మికుడిని కూడా సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. సొరంగం లోపల కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఉత్తరాఖండ్‌(Uttarakhand) ఉత్తరకాశీలోని(Uttarkashi) సొరంగంలో(Tunnel) చిక్కుకున్న 40 మంది కార్మికుల(Workers) పరిస్థితి దయనీయంగా మారింది. అయిదు రోజుల కిందట సొరంగం కూలీలు అందులో చిక్కుకుపోయారు. అయిదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క కార్మికుడిని కూడా సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. సొరంగం లోపల కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారి ఆరోగ్యంపై డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయిదు రోజుల నుంచి నిర్బంధంలో ఉండటం వల్ల వారిలో మానసిక, శారీరక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆక్సిజన్‌(Oxygen), కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు తగ్గడంతో వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. నిర్మాణంలోని వస్తువులు వారిపై పడటం వల్ల తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కూలీల కుటుంబసభ్యులైతే కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను రెస్క్యూ టీమ్‌ తొలగించగలిగింది. నాలుగు పైపులతో కార్మికులకు ఆక్సిజన్‌, నీరు, ఆహారం అందిస్తున్నారు కానీ ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళన మాత్రం అలాగే ఉంది. థాయ్‌లాండ్‌, నార్వేకు చెందిన ఎలైట్‌ రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 2018లో థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్‌ కూడా ఉంది. 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైపులను సొరంగంలోకి పంపించి, దాని ద్వారా కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కూలిపోయిన సొరంగం దగ్గరలోనే చిన్యాలిసౌర్‌ విమానాశ్రయం ఉంది. అక్కడికి అమెరికన్‌ ఆగర్‌ చేరుకుంది. శిథిలాలను తవ్వడానికి ఈ యంత్రం ఉపకరిస్తుంది. నవంబర్‌ 12వ తేదీ ఉదయం ఉత్తరకాశీలోన చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో 40 మంది కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు.

Updated On 17 Nov 2023 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story