దేశ ప్రజలందరి ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరకాశీ(Uttarakashi) సిల్క్యారాటన్నెల్‌లో(Silkyara Tunnel)  చిక్కుకున్న 41 మంది కార్మికులు(Workers) క్షేమంగా బయటకు వచ్చారు. వీరందరిని ర్యాట్ మైనర్ల బృందం(rat miners) సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరు సుబోధ్‌ కుమార్‌ వర్మ(Subodh Kumar Varma) అయితే తనకిది పునర్జన్మ అని చెబుతున్నారు. తాము టన్నెల్‌లో ఆహారం కోసం ఆలమటించిపోయామని, గాలి(Oxygen) ఆడక ఇబ్బంది పడ్డామని చెప్పారు.

దేశ ప్రజలందరి ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరకాశీ(Uttarakashi) సిల్క్యారాటన్నెల్‌లో(Silkyara Tunnel) చిక్కుకున్న 41 మంది కార్మికులు(Workers) క్షేమంగా బయటకు వచ్చారు. వీరందరిని ర్యాట్ మైనర్ల బృందం(rat miners) సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరు సుబోధ్‌ కుమార్‌ వర్మ(Subodh Kumar Varma) అయితే తనకిది పునర్జన్మ అని చెబుతున్నారు. తాము టన్నెల్‌లో ఆహారం కోసం ఆలమటించిపోయామని, గాలి(Oxygen) ఆడక ఇబ్బంది పడ్డామని చెప్పారు. అధికారులు పైపుల ద్వారా ఆహారపదార్థాలను పంపించడంతో ఆకలిదప్పులు తీర్చుకోగలిగామని అన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్‌ కుమార్‌ వర్మ(Vishwajeet Kumar Varma) కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు. తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారని చెప్పారు. తమకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని, ఆక్సిజన్‌తో పాటు ఆహారం కూడా అందించారని పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న మొదటి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం కానీ తర్వాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారని అన్నారు. తర్వాత మైకులు అమర్చి కుటుంబ సభ్యులతో మాట్లాడించారని, ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నామని విశ్వజీత్‌ కుమార్‌ వర్మ్‌ తెలిపారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో టన్నెల్‌లో ప్రమాదం జరిగింది. టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. తర్వాత అధికారులు ఓ పైపు ద్వారా కార్మికులకు మందులు, డ్రై ఫ్రూట్స్‌ పంపించారు. నవంబర్ 20వ తేదీన ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచిడీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్‌, బ్రెడ్, బ్రష్‌లు, టూత్‌పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. 17 రోజుల తర్వాత కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

Updated On 29 Nov 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story