ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంలో రెస్క్యూ ఆపరేషన్ 12వ రోజు కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశలో ఉంది. దీంతో రాబోయే 5 గంటలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంలో రెస్క్యూ ఆపరేషన్(Uttarakhand Tunnel Rescue) 12వ రోజు కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) చివరి దశలో ఉంది. దీంతో రాబోయే 5 గంటలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. గత 12 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఈ మధ్యాహ్నం వరకు సొరంగం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

గురువారం ఆగర్ యంత్రం పనిచేయకపోవడంతో తవ్వకాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కార్మికులను చేరుకోవడానికి మ‌రో 16 మీటర్లు దూరం మాత్రమే మిగిలి ఉంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. గురువారం శిధిలాల కారణంగా యంత్రంలోని కొన్ని భాగాలు విరిగిపోయాయని అధికారులు ధృవీకరించారు.

డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌తో 800 ఎంఎం పైపు ద్వారా లోపలికి వెళ్లి కార్మికులందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీస్తారు. కార్మికులు బలహీనంగా ఉన్నట్లయితే.. స్కేట్‌లతో అమర్చిన తాత్కాలిక ట్రాలీని ఉపయోగించి వారిని బయటకు తీస్తారు. ముందుజాగ్ర‌త్త‌గా సొరంగం వెలుపల అంబులెన్స్‌లను కూడా మోహరించారు.

కూలీలందరినీ చిలియన్సార్ కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకువెళ్లే అవ‌కాశం ఉంది. ఇక్కడ 41 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. చిలియన్సౌర్ చేరుకోవడానికి దాదాపు 1 గంట పడుతుంది, దీని కోసం గ్రీన్ కారిడార్ సిద్ధంగా ఉంది.

అధికారుల ప్రకారం.. కార్మికుల ఆరోగ్యం మరింత దిగజారితే వారిని రిషికేశ్ ఎయిమ్స్‌కు తీసుకువెళ్లే అవ‌కాశం ఉంది. ఈ ప్రమాదం త‌ర్వాత‌ రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న 29 సొరంగాలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. NHAI, ఢిల్లీ మెట్రో నిపుణులు అన్ని సొరంగాలను పరిశీలించి 7 రోజుల్లో నివేదికను సిద్ధం చేస్తారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో 12, ​​జమ్మూ కాశ్మీర్‌లో 6, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఎంపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఒక్కొక్కటి చొప్పున సొరంగాలు నిర్మిస్తున్నారు.

Updated On 23 Nov 2023 10:10 PM GMT
Yagnik

Yagnik

Next Story