ముఖ్యమంత్రి స్వయంగా చేసిన అల్లం ఛాయ్.. సంబరపడిన ప్రజలు
ఉత్తరాఖండ్(UttaraKahnd) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ(Pushkar Singh Dhami) చాలా సింపుల్ మనిషి! ముఖ్యమంత్రినన్న దర్పం ఆయనలో కొంచెం కూడా ఉండదు. నిరాడంబరత ఆయనకున్న మంచి క్వాలిటీలలో ఒకటి. ప్రస్తుతం ఆయన నైనిటాల్‌లో(Nainital) ఉన్నారు. రోజూ ఆయన మార్నింగ్ వాక్(Morning Walk) చేయడం అలవాటు. ఎక్కడ ఉన్నా ఉదయం లేచి కాస్త దూరం నడవాల్సిందే! అలాగే మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కనే ఉన్న టీ దుకాణం(Tea Shop) ఆయనకు కనిపించింది. అక్కడకు వెళ్లి స్వయంగా అల్లం తరిగి ఛాయ్ పెట్టారు. దీనిని గమనించిన అక్కడున్న వారు ముఖ్యమంత్రి చుట్టూ చేరారు. పుష్కర్ సింగ్ వారితో ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత సంప్లిసిటీ ఉన్న ముఖ్యమంత్రి తమకు దొరకడం మన అదృష్టమని అక్కడున్నవారు అనుకున్నారు. తర్వాత ఆ పక్కనే ఉన్న మైదానంలోకి వెళ్లారు ముఖ్యమంత్రి. అక్కడ ఆడుకుంటున్న క్రీడాకారులను పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు.