ఉత్తరాఖండ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు హిందూత్వ సంస్థల ఒత్తిడితో ముస్లిం వ్యక్తితో తన కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. మే 28న పెళ్లి జరగాల్సి ఉంది. తన కూతురు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తడంతో పౌరీ మున్సిపల్ చైర్మన్ యశ్‌పాల్ బెనమ్ తన కుమార్తె పెళ్లిని వాయిదా వేశారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)కు చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు హిందూత్వ(Hindutva) సంస్థల ఒత్తిడితో ముస్లిం వ్యక్తితో తన కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తా సంస్థ పిటిఐ(PT)) నివేదించింది. మే 28న పెళ్లి జరగాల్సి ఉంది. తన కూతురు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తడంతో పౌరీ మున్సిపల్ చైర్మన్(Pauri municipal chairman) యశ్‌పాల్ బెనమ్(Yashpal Benam) తన కుమార్తె పెళ్లిని వాయిదా వేశారు. బీజేపీ నేత కుమార్తె పెళ్లి కార్డు ఫొటో గురువారం సోషల్ మీడియా(Social Media)లో హల్‌చల్ చేసింది. వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. బీజేపీ మద్దతుదారులు, ప్రత్యర్థులు యశ్‌పాల్ బెనమ్ ను విమర్శించడంతో కార్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
విలేకరులతో మాట్లాడిన యశ్‌పాల్ బెనమ్.. తన కూతురు సంతోషం కోసం ముస్లిం యువకుడితో పెళ్లి చేయాలని అనుకున్నానని చెప్పారు. కానీ నెటిజన్లు(Netizens).. పెళ్లిపై స్పందించిన తీరును దృష్టిలో ఉంచుకుని.. వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నేను ప్రజల వాణిని కూడా వినాలి అని యశ్‌పాల్ బెనమ్ అన్నారు. మే 28న పౌరీ నగరంలో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసినట్లు తెలిపారు.
హిందుత్వ సంఘాలు శుక్రవారం ఝండా చౌక్(Jhanda Chawk)లో బీజేపీ నేత యశ్‌పాల్ బెనమ్ కుమార్తె ముస్లింను పెళ్లి చేసుకోబోతున్నందుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. విహెచ్‌పి(VHP), భైరవ సేన(Bhairav Sena), భజరంగ్ దళ్(Bajrang Dal) నిరసనలో పాల్గొన్నాయి. ఈ వివాహాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని జిల్లా వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్‌గౌడ్(Deepak Goud) తెలిపారు.