రేప్‌(Rape) చేసేందుకు ప్రయత్నించిన యువకుడి మర్మాంగాన్ని(penis) ఓ మహిళ కోసిపడేసింది. అంతే కాదు దానిని సంచిలో వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు(Police Station) వెళ్లి జరిగిన విషయాన్ని వివరించింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కౌశాంబి(Koushambi) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రేప్‌(Rape) చేసేందుకు ప్రయత్నించిన యువకుడి మర్మాంగాన్ని(penis) ఓ మహిళ కోసిపడేసింది. అంతే కాదు దానిని సంచిలో వేసుకొని పోలీస్‌స్టేషన్‌కు(Police Station) వెళ్లి జరిగిన విషయాన్ని వివరించింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కౌశాంబి(Koushambi) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ భర్త సౌదీ అరేబియాలో(Sudhi arabia) పనిచేస్తున్నాడు. మహిళ దగ్గర ఓ యువకుడు పనిచేస్తున్నాడు. రేప్‌కు యత్నించాడని ప్రైవేట్‌ పార్ట్‌ను మహిళ కట్‌ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ప్రయాగ్‌రాజ్‌లో ఓ మహిళ ఉంటోంది. భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన దగ్గర పని కోసం ఆ మహిళ 23 ఏళ్ల ఓ యువకుడిని నియమించుకుంది. బుధవారం రోజు కుటుంబ సభ్యులు లేని సమయంలో మహిళపై అత్యాచారం చేసేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. అయితే ఆ మహిళ యువకుడిని(Male) నమ్మించింది. కిచెన్‌ డోర్‌ క్లోజ్‌ చేస్తానని చెప్పి వెళ్లి, కత్తి తీసుకొని వచ్చింది. తర్వాత కత్తితో యువకుడి జననాంగాన్ని కట్‌ చేసింది. అంతేకాదు దానిని సంచిలో వేసుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడి లైంగిక వేధింపులు(Sexual assault) తట్టుకోలేక ఈ పనిచేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు మహిళ ఇంటికి చేరుకొని పరిసరాలను పరిశీలించగా బెడ్‌పై పడి ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. తన వాంగ్మూలంలో మహిళ చెప్పింది అవాస్తమని చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి ఆ మహిళ దగ్గరే పనిచేస్తున్నానని తెలిపాడు. కావాలనే ఆ మహిళ తనను పిలిచి మత్తు మందు ఇచ్చిందని తెలిపాడు. తాను అపస్మారక స్థితిలోకి వెళ్లాక తన ప్రైవేట్‌ పార్ట్‌ను కట్‌ చేసిందని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఇద్దరు వాదనలు విన్న తర్వాత.. పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated On 16 Nov 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story