ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) గోరఖ్‌పూర్‌లోని(Gorakhpur) పిప్రాయిచ్(Piproich) ప్రాంతంలో చిత్రమైన ఘటన జరిగింది. తన వివాహేతర సంబంధం(Extra marital Affair) బయటపడటంతో ఓ మహిళ కరెంట్ పోల్(Current Poll) ఎక్కింది. భర్త, ప్రియుడు ఇద్దరితోనూ కలిసి ఉంటానంటూ వీరంగం వేసింది. వివరాల్లోకి వెళితే కూలీ పని చేసుకుంటున్న రామ్ గోవింద్ అనే వ్యక్తికి 34 ఏళ్ల మహిళతో పెళ్లయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు.

Woman climb Current Pole
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) గోరఖ్‌పూర్‌లోని(Gorakhpur) పిప్రాయిచ్(Piproich) ప్రాంతంలో చిత్రమైన ఘటన జరిగింది. తన వివాహేతర సంబంధం(Extra marital Affair) బయటపడటంతో ఓ మహిళ కరెంట్ పోల్(Current Poll) ఎక్కింది. భర్త, ప్రియుడు ఇద్దరితోనూ కలిసి ఉంటానంటూ వీరంగం వేసింది. వివరాల్లోకి వెళితే కూలీ పని చేసుకుంటున్న రామ్ గోవింద్ అనే వ్యక్తికి 34 ఏళ్ల మహిళతో పెళ్లయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆమెకు పక్క ఊర్లో ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏడేళ్లుగా వీరి సంబంధం నిరాటంకంగా సాగుతూ వస్తున్నది. భార్యకు మరోక వ్యక్తితో సంబంధం ఉందన్న విషయం భర్తకు తెలిసింది. భార్యను నిలదీశాడు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే తన ప్రియుడు కూడా తనతోనే ఇంట్లోనే ఉంటాడని, అతడు ఇంట్లో ఉంటే ఆర్ధిక సమస్యలు తీరతాయని భర్తతో చెప్పింది. ఏ భర్త అయినా దీనికి ఎందుకు ఒప్పుకుంటాడు? గోవింద్ కూడా అంతే! దాంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది భార్య. వెళ్లడం వెళ్లడమే గ్రామంలోని ఓ కరెంట్ పోల్ ఎక్కి నిరసన చేపట్టింది. హైటెన్షన్ వైర్ల మధ్య స్తంభంపై కూర్చొవడం చూసి జనాలకు టెన్షన్ మొదయ్యింది. వెంటనే కరెంట్ అధికారులకు విషయం చెప్పింది. వారు వెంటనే విద్యత్ సరఫరాను ఆపేశారు. తర్వాత పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమెను కిందకు దించే ప్రయత్నం చేశారు. దిగనంటే దిగనని మొండికేసింది. ఎలాగోలా ఆమెను కిందకి దించి హమ్మయ్య అని అనుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
