ఓ భర్తగారు తన భార్యకు ప్రేమతో 30 రూపాయలు పెట్టి ఓ లిప్‌స్టిక్‌ను(Lipstick) కొన్నాడు. తన శ్రీమతికి కానుకగా ఇచ్చాడు. ఆ లిప్‌స్టిక్‌ను, దాని ఖరీదును చూసి భార్యమణి అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. మొగుడితో తగువు పెట్టుకుంది. గొడవ ముదరడంతో అలిగి పుట్టింటికి వెళ్లింది. వెళుతూ వెళుతూ భర్తపై పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. తనకు తక్షణమే విడాకులు(Divorce) మంజూరు చేయండి అంటూ డిమాండ్ చేసింది.
ఓ భర్తగారు తన భార్యకు ప్రేమతో 30 రూపాయలు పెట్టి ఓ లిప్‌స్టిక్‌ను(Lipstick) కొన్నాడు. తన శ్రీమతికి కానుకగా ఇచ్చాడు. ఆ లిప్‌స్టిక్‌ను, దాని ఖరీదును చూసి భార్యమణి అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. మొగుడితో తగువు పెట్టుకుంది. గొడవ ముదరడంతో అలిగి పుట్టింటికి వెళ్లింది. వెళుతూ వెళుతూ భర్తపై పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. తనకు తక్షణమే విడాకులు(Divorce) మంజూరు చేయండి అంటూ డిమాండ్ చేసింది. ఇంతకీ భార్యకు కోపం వచ్చింది చీప్‌గా 30 రూపాయలు పెట్టి లిప్‌స్టిక్ కొన్నందుకు కాదు.. అంత డబ్బు పెట్టి ఎందుకు కొనాల్సి వచ్చిందన్నదే ఆమె బాధ. చౌక ధరకు దొరికే లిప్‌స్టిక్‌ను కొనొచ్చు కదా అన్నది ఆమె ప్రశ్న! ఈ మాత్రం దానికే ఇంత గొడవ పడాలా అని పోలీసులు ఆశ్చర్యపోయి దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar pradesh) ఆగ్రా(Agra) జిల్లాలో జరిగింది. ఎత్మాద్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళకు మధురకు చెందిన వ్యక్తితో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. చక్కగా కాపురం చేసుకుంటున్న ఆ దంపతుల మధ్య లిప్‌స్టిక్ చిచ్చు పెట్టింది. ఇంటి ఆర్ధిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్న మొగుడి నుంచి విడాకులు కావాలంది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె మనసు మార్చుకుంది. అలాగే భార్య కోరినట్టుగానే తక్కువ ధర ఉన్న లిప్‌స్టిక్‌ను కొంటానని భర్త మాటిచ్చాడు. దాంతో భార్యభర్తలిద్దరూ చేతిలో చేయివేసుకుని ఇంటిదారిపట్టారు.