ఎంత దొంగోడు అయినా అతడికి భయం భక్తి అంటూ ఉండి ఏడుస్తాయిగా! పైగా దేవుడి సొమ్ము దొంగిలిస్తున్నప్పుడు పిసరంత భయం ఎక్కువుంటుంది. ఇట్టాగే ఓ దొంగ భక్తుడు(Thief) (దీన్ని ఎలా అర్థం చేసుకున్నా సరే) చాలా భక్తితో దొంగతనం చేశారు. గుడిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని, ప్రార్థనలు చేసి తర్వాత విగ్రహాన్నే(IDOL) ఎత్తుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మీరట్(Meerut) జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఎంత దొంగోడు అయినా అతడికి భయం భక్తి అంటూ ఉండి ఏడుస్తాయిగా! పైగా దేవుడి సొమ్ము దొంగిలిస్తున్నప్పుడు పిసరంత భయం ఎక్కువుంటుంది. ఇట్టాగే ఓ దొంగ భక్తుడు(Thief) (దీన్ని ఎలా అర్థం చేసుకున్నా సరే) చాలా భక్తితో దొంగతనం చేశారు. గుడిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని, ప్రార్థనలు చేసి తర్వాత విగ్రహాన్నే(IDOL) ఎత్తుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మీరట్(Meerut) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12వ తేదీన అబ్దుల్లాపూర్ ప్రాంతంలోని శివాలయంలో ఓ వ్యక్తి ప్రవేశించాడు. మొదట చాలా భక్తిని ప్రదర్శించాడు. మన రాజకీయ నాయకుల్లాగే అక్కడున్న దేవుళ్లందరికి దండం పెట్టాడు. ప్రార్థనలు చేశాడు. తర్వాత బయటకు వెళ్లి ఎవరైనా వస్తున్నారేమోనని చూశాడు. మళ్లీ గుడిలోకి వచ్చాడు. దేవుడి విగ్రహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకుని అక్కడ్నుంచి చల్లగా జారుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ ఆలయలోని సీసీటీవీలో చక్కగా రికార్డయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో(social media) ఈ వీడయో క్లిప్ బాగా వైరల్ అవుతోంది. ఆ శివాలయంలో రాగితో చేసిన శివలింగంపై నాగదేవత విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్నే దొంగోడు ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని భక్తాగ్రేసుడైన దొంగ కోసం వెతుకుతున్నారు.