ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాథ్రాస్‌లో 121 మందికిపైగా అమాయకుల ఉసురు తీసుకున్న భోలే బాబా(Bhole Baba) పరారీలో ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హాథ్రాస్‌లో 121 మందికిపైగా అమాయకుల ఉసురు తీసుకున్న భోలే బాబా(Bhole Baba) పరారీలో ఉన్నాడు. మంగళవారం భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయిన విషయం తెలిసిందే! ఆ ఘటన జరిగినప్పట్నుంచి భోలే బాబా ఆచూకీ దొరకడం లేదు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళుతున్నప్పుడు భక్త జనం ఆయన వాహనం వెంటపడ్డారు. అతడు నడిచిన ప్రదేశంలో మట్టిని తీసుకోవాలన్న ఉద్దేశంతో భక్తులు ఎగబడ్డారు. అప్పుడే తొక్కిసలాట జరిగింది. జనం ఒకరి మీద ఒకరు(stampede) పడ్డారు. ఈ ఘటనలోనే అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే మెయిన్‌పురి జిల్లాలోని భోలేబాబాకు చెందిన రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్టులో పోలీసులు గాలించారు. ఎక్కడా భోలే బాబా ఆచూకి దొరకలేదు. ఇంత మంది చావుకు కారణమైన బాబాపై ఎలాంటి కేసు నమోదు చేస్తారో చూడాలి. ఇప్పటి వరకు ఈ ఘటనలో నిర్వాహకుడు దేవ్ ప్రకాశ్ మధుకర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఆధ్యాత్మక కార్యక్రమానికి ఊహించని విధంగా రెండున్నర లక్షల మంది హాజరయ్యారట! నిజానికి 80 వేల మందికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు అంటున్నారు ఇంత మంది వచ్చినపప్పటికీ 40 మంది పోలీసులు మాత్రమే విధుల్లో ఉండటం గమనార్హం