ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌నుAteeq Ahmed) దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన భార్య షాయిస్తా పర్వీన్‌ కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు వెతుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌నుAteeq Ahmed) దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన భార్య షాయిస్తా పర్వీన్‌ కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు వెతుకున్నారు. ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో ఉన్న 51 ఏళ్ల షాయిస్తా పర్వీన్‌ను( Shaista Parveen)పట్టిస్తే 50 వేల రూపాయల(50K) రివార్డును కూడా యూపీ పోలీసులు ప్రకటించారు. భర్త అంత్యక్రియలకు వస్తుందని పోలీసులు నిఘా పెట్టారు. కానీ అప్పుడామె రాలేదు. అతీక్‌ అహ్మద్‌ హత్య నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడామె కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే షాయిస్తా కొడుకు అసద్‌, భర్త అతీక్‌లను కోల్పోయింది. అసలు పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే, అతీక్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. భర్తను హత్య చేశారన్న కబురు తెలియగానే షాయిస్తా వెక్కి వెక్కి ఏడ్చిందట. కళ్లు తిరిగి పడిపోయిందట. షాయిస్తా పర్వీన్‌ తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనే పని చేసి రిటైరయ్యారు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న షాయిస్తాకు అప్పుడు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. 1996లో అతీక్‌ అహ్మద్‌తో పెళ్లి జరిగింది. ముందు గృహిణిగానే ఉండింది. 2009లో ఈమెపై ప్రయాగరాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు చీటింగ్‌ కేసులు. ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో నమోదయ్యాయి. నాలుగోది ఉమేశ్‌ పాల్‌ హత్య కేసు. ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితులలో షాయిస్తా కూడా ఒకరు. భర్త అతీక్‌ అహ్మద్‌, ఇద్దరు కుమారులు, అతీక్‌ సోదరుడు అష్రఫ్‌లు సహ నిందితులు. షాయిస్తాకు రాజకీయాలతో అనుబంధం ఉంది. 2021లో ఆమె మజ్లిస్‌ పార్టీలో చేరారు. రెండేళ్ల తర్వాత బీఎస్పీలో చేరారు. తన భర్త అతీక్‌ సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతతో ఉన్న స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయారని షాయిస్తా సన్నిహితులతో చెప్పుకునేది. అతీక్‌ కూడా బీఎస్పీ అంటే ఇష్టమేనని, ఆ పార్టీ అగ్రనేతలకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నాడని తెలిపింది. తర్వాత జరిగిన మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న షాయిస్తాకు మాయావతి నో చెప్పారు. ఉమేశ్‌పాల్‌ హత్యకు ప్లాన్ వేసింది, దాన్ని అమలు చేసింది షాయిస్తానేనని పోలీసులు తెలిపారు. అతీక్‌ నేరసామ్రాజాన్యి షాయిస్తా చక్కగా నడిపేవారని చెప్పారు. అతీక్‌ జైల్లో ఉన్నప్పుడు మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలను చక్కబెట్టింది కూడా షాయిస్తానేనని పోలీసులు వివరించారు. ఇదిలా ఉంటే రెండు నెలల కిందట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్వీన్‌ షాయిస్తా రాసిన లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో అతీక్‌, అష్రఫ్‌లను అనవసరంగా ఇరికించారని, ఉమేశ్‌పాల్‌ హత్యలో మంత్రి నంద గోపాల్‌ కీలక పాత్ర పోషించారని ఆ లేఖలో షాయిస్తా పేర్కొన్నారు. ఫిబ్రవరి 27 షాయిస్తా రాసిన ఆ లేఖ అతీక్‌ చనిపోయిన తర్వాత ఇప్పుడు బయటపడింది.

Updated On 19 April 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story