Actress Jayaprada :నటి జయప్రద కోసం వెతుకుతున్న పోలీసులు
నటి జయప్రద(Jayaprada) కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలోనే కొనసాగుతోన్న జయప్రదను పోలీసులు ఎందుకు వెతుకున్నారంటే, ఆమె 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(Election code of conduct) ఉల్లంఘించారట! రెండు కేసులలో(Cases) జయప్రద నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే చాలాసార్లు న్యాయమూర్తి ఆదేశించారు. ఆమె మాత్రం హాజరు కాలేదు.
నటి జయప్రద(Jayaprada) కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలోనే కొనసాగుతోన్న జయప్రదను పోలీసులు ఎందుకు వెతుకున్నారంటే, ఆమె 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని(Election code of conduct) ఉల్లంఘించారట! రెండు కేసులలో(Cases) జయప్రద నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే చాలాసార్లు న్యాయమూర్తి ఆదేశించారు. ఆమె మాత్రం హాజరు కాలేదు. దీంతో జయప్రదపై జడ్జ్ నాన్ బెయిలబుల్(NBW) వారెంట్ జారీ ఏశారు. జనవరి 10వ తేదీలోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో రామ్‌పూర్(Raipur) ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె అడ్రస్‌ను కనిపెట్టలేకపోయింది. ఏప్రిల్ 19, 2019న జయప్రద ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) స్వర్ ప్రాంతంలో ఉన్న నూర్‌పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు. పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.