మాంసం తినండి కానీ ఎముకలు మెడలో వేసుకుని తిరగొద్దు అనేది ఓ సామెత. అలాగే ఇంట్లో నోట్ల కట్టలున్నాయని వాటితో సెల్ఫీలు దిగేయకూడదు.. పాపం ఈ విషయం ఆ పోలీసు అధికారి శ్రీమతికి తెలియదు..ఫలితంగా ఆ అధికారి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం! ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీసు స్టేషన్‌లో రమేశ్ చంద్ర సహాని అనే ఎస్‌ఐ ఉన్నారు.
మాంసం తినండి కానీ ఎముకలు మెడలో వేసుకుని తిరగొద్దు అనేది ఓ సామెత. అలాగే ఇంట్లో నోట్ల కట్టలున్నాయని వాటితో సెల్ఫీలు దిగేయకూడదు.. పాపం ఈ విషయం ఆ పోలీసు అధికారి శ్రీమతికి తెలియదు..ఫలితంగా ఆ అధికారి ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి వచ్చింది. అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం! ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీసు స్టేషన్‌లో రమేశ్ చంద్ర సహాని అనే ఎస్‌ఐ ఉన్నారు. ఇటీవల ఆయన భార్య, పిల్లలు కలిసి ఇంట్లో ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలతో సెల్ఫీ దిగారు. దిగితే దిగారు కానీ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. ఇంతగా వైరల్ అవుతుంటే ఉన్నతాధికారులకు కనిపించకుండా ఉంటుందా? వారు కూడా చూశాడు. ఎస్‌ఐ ఇంట్లో ఇన్నేసి నోట్ల కట్టలా? అని ఆశ్చర్యపడ్డారు. సహానిపై విచారణకు ఆదేశించారు. ముందస్తుగా ఆయనను మరో ప్రాంతానికి బదిలీ చేశారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏమున్నదంటే 14లక్షల రూపాయల విలువైన నగదును ఒక బెడ్‌పై వరుసగా పేర్చి.. వాటి పక్కన సహానీ భార్య, ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు. ఈ ఫోటోపై ఎస్‌ఐ సహాని క్లారిటీ ఇస్తూ .. ఆ ఫోటో ఇప్పుటిది కాదని, నవంబర్ 14, 2021న దిగిన ఫోటో అని చెప్పుకొచ్చారు. అప్పుడు స్థిరాస్తిని అమ్మగా వచ్చిన సొమ్మే అదని అన్నారు. 'రమేష్ చంద్ర సహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరుపుతున్నాము. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారి బదిలీ అయ్యారు. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది' అని ఉన్నతాధికారులు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామన్నారు.