నా పెళ్లి, నా కారు, నా బరాత్‌ అంటే కుదరదు మరి.. దేనికైనా ఓ పద్దతి పాడూ ఉంటాయి! నా కారే కాబట్టి టాప్‌పై విగ్రహంగా నిల్చుని పెళ్లి మండపానికి వెళతానంటే పోలీసులు నిగ్రహం కోల్పోకుండా ఉంటారా? అసలేం జరిగిందటే ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) షహరాన్‌పూర్‌లోని(Shahranpur) బైలా గ్రామానికి చెందిన అంకిత్‌(Ankit) అనే యువకుడికి మీరట్‌లోని కుషావలీ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది.

నా పెళ్లి, నా కారు, నా బరాత్‌ అంటే కుదరదు మరి.. దేనికైనా ఓ పద్దతి పాడూ ఉంటాయి! నా కారే కాబట్టి టాప్‌పై విగ్రహంగా నిల్చుని పెళ్లి మండపానికి వెళతానంటే పోలీసులు నిగ్రహం కోల్పోకుండా ఉంటారా? అసలేం జరిగిందటే ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) షహరాన్‌పూర్‌లోని(Shahranpur) బైలా గ్రామానికి చెందిన అంకిత్‌(Ankit) అనే యువకుడికి మీరట్‌లోని కుషావలీ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. వధువు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లన్నీ చేశారు. అంకిత్‌ తన ఊరునుంచి పెళ్లి మండపానికి చేరుకోవాలి. అంటే బరాత్‌ అన్నమాట! బ్యాండ్‌ మేళం, డప్పు చప్పుళ్ల మధ్య ఓ గుర్రం మీదో, ఏ బుల్లెట్‌ మీదో వెళ్లొచ్చు. కానీ మనోడు కారులో బయలుదేరాడు. కారులో వెళ్లడం తప్పేమీ కాదు. కాకపోతే కారులోపల కూర్చోకుండా, టాపెక్కి విగ్రహంలా నిల్చొని ఊరేగింపులా బయలుదేరాడు. ఇది కూడా ఓకేనే! డిల్లీ-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిపై ఇతడి ఫోటోలు తీయడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. విషయం మన్సూర్‌పూర్‌ పోలీసులకు తెలిసింది. వారు వెంటనే వచ్చేసి నేషనల్‌ హైవే 58లో వరుడి బరాత్‌ను అడ్డుకున్నారు. ఊరేగింపుకు వాడిన ఎస్‌యూవీ వాహనాన్ని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాపం పెళ్లి ఆగిపోకూడదని అతడిని మరో కారులు కుషావలీ గ్రామానికి పంపించారు.

Updated On 14 March 2024 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story