ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) బయటపడిన ఓ ఘరానా మోసం చూస్తే ఇలా కూడా మోసాలు చేయవచ్చా అనే అనుమానం కలుగుతుంది. ఆ స్కామ్ వివరాలు అధికారులకే షాకిచ్చాయి. సామూహిక వివాహాల పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్మును కాజేయడానికి మోసగాళ్లు ఏకంగా నకిలీ పెళ్లిళ్లు(Fake Marriages) చేశారు. వరుడు లేకుండానే వందలాది మంది మహిళలు ఎవరికి వారు మెడలో దండలు వేసుకుని పెళ్లి తంతు కానిచ్చేశారు.

Fake Marriage Scam
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) బయటపడిన ఓ ఘరానా మోసం చూస్తే ఇలా కూడా మోసాలు చేయవచ్చా అనే అనుమానం కలుగుతుంది. ఆ స్కామ్ వివరాలు అధికారులకే షాకిచ్చాయి. సామూహిక వివాహాల పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్మును కాజేయడానికి మోసగాళ్లు ఏకంగా నకిలీ పెళ్లిళ్లు(Fake Marriages) చేశారు. వరుడు లేకుండానే వందలాది మంది మహిళలు ఎవరికి వారు మెడలో దండలు వేసుకుని పెళ్లి తంతు కానిచ్చేశారు. వధువు వేషం వేసిన వారంతా పాపం అయిదు వందలు, రెండు వేల రూపాయలకు ఆశపడి వచ్చినవారే! వారికి ఆ సొమ్మును ఇచ్చి కిరాయికి తీసుకొచ్చారు కేటుగాళ్లు. జనవరి 25న బలియా జిల్లాలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. ఈ స్కామ్‌కు సంబంధించి ఇద్దరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో పాటు మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజున కార్యక్రమంలో భాగంగా 568 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. ఇందులో సుమారు 200 జంటలు నకిలీవే కావడం గమనార్హం. వీరిలో కొంతమంది గతంలో పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అప్లికేషన్లను నిశితంగా పరిశీలించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారు. అన్నట్టు ఈ కార్యక్రమానికి బీజేపీ(BJP) ఎమ్మెల్యే కేక్తి సింగ్(Kethki Singh) ముఖ్య అతిథిగా హాజరు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం 51 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది.
