దేశంలో టమాట ధరలు చంద్రయాన్-3తో పాటుగా నింగికెగిశాయి. సామాన్యులకు అందుబాటులో లేనంతగా ధరలు పెరిగాయి. కిలో రెండొందలు దాటింది. అయినా సరే తప్పదు కాబట్టి కొందరు వందగ్రాములో, పావుకిలోనో కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటున్నారు. టమాట పంటకు సెక్యూరిటీ పెట్టడం కొత్తగా చూస్తున్నాం. అలాగే టమాటాలను దొంగలెత్తుకుపోతున్న వింత వైనాలు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టమాట ధరలకు సబంధించిన మీమ్స్‌కు లెక్కేలేదు.
దేశంలో టమాట(Tomato) ధరలు చంద్రయాన్-3తో(Chandrayan-3) పాటుగా నింగికెగిశాయి. సామాన్యులకు అందుబాటులో లేనంతగా ధరలు పెరిగాయి. కిలో రెండొందలు దాటింది. అయినా సరే తప్పదు కాబట్టి కొందరు వందగ్రాములో, పావుకిలోనో కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటున్నారు. టమాట పంటకు సెక్యూరిటీ పెట్టడం కొత్తగా చూస్తున్నాం. అలాగే టమాటాలను దొంగలెత్తుకుపోతున్న వింత వైనాలు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టమాట ధరలకు సబంధించిన మీమ్స్‌కు లెక్కేలేదు. కొండెక్కిన టమాట(Tomato Prices) ధరను కిందకు దింపడానికి ప్రభుత్వాలు నానా పాట్లు పడుతున్నాయి. అయితే పెరిగిన టమాట ధరల సమస్యకు ఓ మహిళా మంత్రిగారు చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టారు. ధరలు పెరిగాయని బాధపడటం ఎందుకు..?
సింపుల్‌గా తినడం మానేస్తే సరి అని మాంచి సలహానొకటి పారేశారు. సదరు మహిళా మంత్రి పేరు ప్రతిభా శుక్లా(Pratibha Shukla).. ఈమె ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. పొద్దస్తమానమూ టమాటల ధరలు పెరిగాయని మొత్తుకోవడం ఎందుకు? అవి తినడం మానేయొచ్చు కదా అని ప్రజలకు హితవు చెబుతున్నారమె! 'టమాటల ధరలు పెరిగాయని ఫీలవ్వడం ఎందుకు? ఇంటి పెరట్లో టమాట మొక్కలను పెంచుకుంటే సరిపోతుంది కదా. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వ సహకారం అందిస్తోంది కదా! అసలు టమాటాలు తినడం మానేస్తే ధరలు వాటంటత అవే తగ్గిపోతాయి కదా! టమాటాలనే తినాలన్న రూలేమీ లేదుగా.. వాటికి బదులు నిమ్మకాయ తింటే పోలా... దేశంలో ఎవరూ టమాటలు తినకపోతే ధరలు ఎందుకు దిగి రావు' ? అంటూ మంత్రి తెలివైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇలాంటి బహు చక్కటి స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాము ఉల్లిపాయలు తినమని, అంచేత ధరల గురించి తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.