సైబర్ నేరాలు(Cyber crimes) ఎన్నో చూశాం.. కానీ ఇలాంటి తరహా సైబర్ మోసం కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోక మానరు.
సైబర్ నేరాలు(Cyber crimes) ఎన్నో చూశాం.. కానీ ఇలాంటి తరహా సైబర్ మోసం కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోక మానరు. మగవారిని ఆకర్షించే ఒక వినూత్న ఉద్యోగ ప్రకటనను(Job advertisement) చూసి ఓ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసి దాదాపు డబ్బులు పోగొట్టుకున్నాడు. బాడాబాబుల కూతుర్లకు కడుపు(Pregnant) చేస్తే రూ.5 లక్షల ఇస్తామని ఓ ప్రకటన వచ్చింది. దీనిపై ఓ యువకుడు ఆసక్తి కనబర్చాడు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ రూ.800, విదేశాలకు వెళ్లేందుకు అనుమతుల కోసమని మరో రూ.24 వేలు వసూలు చేశారు. విదేశాలకు వెళల్లేందుకు రూ.3 లక్షలు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బకర్‌గంజ్(Bakarganj) ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఈ వింత ప్రకటన చూసి అట్రాక్ట్ అయ్యాడు. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతులకు గర్భం చేస్తే 5 లక్షల నగదు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సోషల్ మీడియాలో ప్రకటన చూసి అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేశాడు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.800 చెల్లించాడు. విదేశాలకు వెళ్లేందుకు పేపర్ వర్క్ కోసమని మరో రూ.24 వేల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత మరో రూ.3 లక్షలు పంపించాలని డిమాండ్ చేశారు.. అందుకు అల్తాఫ్ నిరాకరించడంతో అతనిపై కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించాడు. తాము పోలీసు అధికారులమంటూ బెదిరించడంతో ప్రయాగ్‌రాగ్ సైబర్ క్రైమ్ పోలీసులను అల్తాఫ్ ఆశ్రయించాడు. అల్తాఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.