అదేమిటో కానీ చిత్ర విచిత్రాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే(Uttar Pradesh) జరుగుతుంటాయి. ఇప్పుడు కొత్తగా మరో విచిత్రమైన ఉదంతం అక్కడ చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో అంటే పదిహేనేళ్ల కిందటి ఓ కేసులో నిందితుడికి కోర్టు ఎట్టకేలకు శిక్ష విధించింది.

అదేమిటో కానీ చిత్ర విచిత్రాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే(Uttar Pradesh) జరుగుతుంటాయి. ఇప్పుడు కొత్తగా మరో విచిత్రమైన ఉదంతం అక్కడ చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో అంటే పదిహేనేళ్ల కిందటి ఓ కేసులో నిందితుడికి కోర్టు ఎట్టకేలకు శిక్ష విధించింది. కేసేమిటంటే 2008లో ఓ మైనర్‌(Minor boy) బాలుడు మరో మైనర్‌ బాలికకు(Minor Girl) ప్రేమలేఖ(Love Letter) రాశాడు. రాసినవాడు రాసినట్టు ఉండక ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ బాలిక బెదరకుండా విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కూతురుకు అశ్లీల రీతిలో అసభ్యకరంగా ఉత్తరం రాయడంతో పాటు ఆమెను వేధించాడంటూ ఆ కంప్లయింట్‌లో పేర్కొంది. పోలీసులు ఆ బాలుడిపై కేసు నమోదు చేశారు. వ్యవహారం కోర్టుకు చేరింది. పదిహేనేళ్లుగా ఈ కేసు నడుస్తూనే ఉంది.

పది మందికిపైగా జడ్జిలు(Judges) మారారు. 70 నుంచి 80 వాయిదాలు పడ్డాయి. బాల బాలికలు కాస్తా యువతీ యువకులయ్యారు. తాజాగా ఓ ఉన్నతాధికారి ఈ కేసులో చొరవ తీసుకుని , త్వరగా కేసును పరిష్కరించాలంటూ న్యాయమూర్తి బీడీ గుప్తాను రిక్వెస్ట్‌ చేశారు. ఇన్నాళ్లకు, ఇంతకాలానికి ఆ బాలుడిని, సారీ ఆ యువకుడిని దోషిగా నిర్ధారిస్తూ సంవత్సర కాలం శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దాంతో పాటు మూడు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. నిందితుడు న్యాయమూర్తి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. తాను ఎలాంటి కేసును ఎదుర్కోలేనని, ఇలాంటి తప్పును మరోసారి చేయనని న్యాయమూర్తికి చెప్పుకున్నాడు. న్యాయమూర్తి కూడా ఆ యువకుడి సత్ప్రవర్తను గమనించారు. తెలిసీ తెలియని వయసులో ఆ లవ్‌లెటర్‌ రాసి ఉంటాడని భావించి ఉంటారు. అయినప్పటికీ తప్పు తప్పే కనుక ఆ యువకుడికి ఏడాది పాటు ప్రొబెషన్‌ శిక్ష విధించారు. దీంతో ఆ యువకుడు ఏడాది పాటు ప్రాసిక్యూటింగ్‌ అధికారి పరిశీలనలో ఉండాల్సి ఉంటుంది.

Updated On 1 Jun 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story