ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో గుండెలను మెలిపెట్టే ఘటన చోటు చేసుకుంది. కరకు హృదయాలకు కూడా కన్నీళ్లు తెప్పించే ఆ ఉదంతం ఔరయ్య జిల్లా(Auraiya district )లో జరిగింది. అక్కడ ఆరోగ్య సేవలు(Community Health Center) ఎంత ఘోరంగా ఉన్నాయో మరోసారి తెలిసింది. నవీన్ బస్తీలో ఉంటున్న ప్రబల్ ప్రతాప్‌సింగ్ కూతురు అంజలి విద్యుదాఘాతానికి గురయ్యింది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో గుండెలను మెలిపెట్టే ఘటన చోటు చేసుకుంది. కరకు హృదయాలకు కూడా కన్నీళ్లు తెప్పించే ఆ ఉదంతం ఔరయ్య జిల్లా(Auraiya district )లో జరిగింది. అక్కడ ఆరోగ్య సేవలు(Community Health Center) ఎంత ఘోరంగా ఉన్నాయో మరోసారి తెలిసింది. నవీన్ బస్తీలో ఉంటున్న ప్రబల్ ప్రతాప్‌సింగ్ కూతురు అంజలి విద్యుదాఘాతానికి గురయ్యింది. 20 ఏళ్ల అంజలి పొరపాటున వేడి నీటితో నిండి ఉన్న బకెట్‌లోని వాటర్ హీటర్‌ను ముట్టుకుంది. వెంటనే అపస్మారకస్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే అంజలి చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఎలాంటి వాహనమూ లేదు. దాంతో మృతురాలి అన్న పెద్ద సాహసమే చేశాడు. చెల్లి (sister)మృతదేహాన్ని బైక్(byke)పై ఉంచి, చున్నీతో తన నడుముకు కట్టుకున్నాడు. వెనక మరో సోదరిని కూర్చోబెట్టుకుని ఇంటి వరకు తీసుకొచ్చాడు. ఇందుకు పావుగంట పట్టింది. ఇదంతా చూస్తూ కూడా ఆసుప్రతి సిబ్బంది పట్టనట్టుగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో రావడంతో సీహెచ్‌సీ (chc)సూపరింటెండెంట్ రియాక్టవ్వాల్సి వచ్చింది. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వాహనం కావాలని అడిగితే ఇచ్చేవాళ్లమని అన్నారు. జిల్లా మొత్తానికి రెండంటే రెండే అంబులెన్స్‌లు ఉండటం గమనార్హం. అవి ఔరయ్య సర్కారు ఆసుపత్రికి చేరుకోడానికి రెండున్నర గంటలు పడుతుందట!