పోలీసుల ఆధీనంలో ఉన్న తన 22 ఒంటెలను తనకు ఇప్పించండి మహాప్రభో అంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని(Court) ఆశ్రయించాడు. ఈ చిత్ర విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మీరట్‌లో(Meerat) జరిగింది.
పోలీసుల ఆధీనంలో ఉన్న తన 22 ఒంటెలను తనకు ఇప్పించండి మహాప్రభో అంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని(Court) ఆశ్రయించాడు. ఈ చిత్ర విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మీరట్‌లో(Meerat) జరిగింది. పాపం ఆ వ్యక్తి పిటీషన్‌పై స్పందించిన హైకోర్టు లిసాడిగేట్ పోలీస్‌స్టేషన్(Lisadigate Police Station) ఇన్‌స్పెక్టర్ నుంచి సమాధానం కోరింది. మార్చిలో ఈ కేసు విచారణకు రానుంది. 2019 నుంచి ఈ కేసు నడుస్తోంది. ఆ ఏడాది ఆగస్టులో ఈద్ సందర్భంగా ఒంటెలను(Camel) బలి ఇవ్వడాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు యంత్రాంగం నిషేధించింది. ముందు జాగ్రత్తగా మీరట్‌లోని మహ్మద్ అనాస్‌కు(Muhammad Anas) చెందిన 22 ఒంటెలను లిసాడి గేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నేళ్లయినా ఒంటెలను పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో విసుగు చెందిన మహ్మద్ అనాస్ 2022లో హైకోర్టును ఆశ్రయించాడు. తన ఒంటెలను తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా హైకోర్టును వేడుకున్నాడు. 2023, జనవరి 12వ తేదీన ఒంటెలను అనాస్‌కు తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించలేదని అనాస్ తరపు న్యాయవాది షామ్స్ ఉ జమాన్ తెలిపాడు.
ఇప్పుడు ఈ ఉదంతంపై తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మార్చి 18వ తేదీన హైకోర్టులో విచారణకు రానుంది. అనాస్‌కు చెందిన 22 ఒంటెలను పోలీసులు తిరిగి అతని ఇవ్వని విషయం తమ దృష్టికి వచ్చిందని సిటీ మెజిస్ట్రేట్ తెలిపారు. అందుకే లిసాడి గేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుంచి దీనికి తక్షణం సమాధానం కోరామని ఆయన చెప్పారు.