ఓ భర్త తలదించుకునేలా ప్రవర్తించాడు. వివాహ బంధాన్ని(Marriage) ఓ జూదగాడు(Gambler) అపహాస్యం చేశాడు. జూదానికి బానిసై ఏకంగా భార్యనే తాకట్టు పెట్టాడు ఈ ప్రబుద్దుడు. ఎక్కడో దూరంగా తీసుకెళ్లి వదిలేసి వచ్చాడు. ఆమె సోదరుడు రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) అమ్రెహాలో ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని దిదోలి కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఓ తండ్రి.. తన కూతురును దేహాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశాడు. ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెళ్లైన తొలి రోజు నుంచే అత్తామామలు అదనపు కట్నం(Dowry) కోసం మానసికంగా, శారీరకంగా మహిళను వేధించేవారు. అంతే కాకుండా భర్త కూడా జూదానికి అలవాటు పడి తరుచుగా డబ్బులు తేవాలని చెప్పాడు. జూదం ఆడేందుకు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒకసారి భర్తతో పాటు మహిళ ఢిల్లీ వెళ్లింది. అక్కడ భార్యను తాకట్టు పెట్టి జూదం ఆడి ఓడిపోయాడు. దీంతో భార్యను అక్కడే వదిలేసి సొంతూరు వచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు ఢిల్లీ వెళ్లి రక్షించాడు.
ఆ మహిళ ఇప్పుడు మహిళ ఒంటరిగా ఉంటోంది. ఇదే అదునుగా భావించిన మరిది ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. మరిది వేధింపులు తాళలేక ఆ మహిళ.. ఎస్పీ అనుపమసింగ్‌కు(SP Anupama singh) ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు 9 మందిపై వరకట్న వేధింపులు, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.