ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ డాక్టర్ ఆపరేషన్ తర్వాత పేషెంట్ కడుపులో(Kadupulo) దూదిని(Cotton) వదిలేశాడు. ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో పరుగుపరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఓ డాక్టర్ ఆపరేషన్ తర్వాత పేషెంట్ కడుపులో(Kadupulo) దూదిని(Cotton) వదిలేశాడు. ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో పరుగుపరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ అనే వ్యక్తి పిత్తాశయంలో అనారోగ్యం కారణంగా అదే ప్రాంతంలోని హాపుర్ రోడ్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. అక్కడ గత నెలలోనే ఓ వైద్యుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. అయితే వైద్యుడు ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు. సర్జరీ తర్వాత పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోగా.. రోజురోజుకు మరింత క్షీణించసాగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా.. అతడి కడుపులో దూది ఉండటం చూసి షాకయ్యారు. దీంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి దూదిని బయటకు తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడని, సదరు ఆస్పత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బిలాల్పోలీసులకు ఫిర్యాదు చేశాడు.