హుజురాబాద్(Huzurabad) ఎమ్మెల్యే, బీజేపీ(BJP) నేత ఈటల రాజేందర్‌తో(Etala Rajenndra) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్(Deputy CM Brijesh Pathak) భేటీ అయ్యారు. ఈటెల శామీర్ పేట్(Shameer Pet) నివాసంలో జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఈటెల రాజేందర్ కనపడుట లేదని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

Deputy CM Brijesh Pathak
హుజురాబాద్(Huzurabad) ఎమ్మెల్యే, బీజేపీ(BJP) నేత ఈటల రాజేందర్‌తో(Etala Rajenndra) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్(Deputy CM Brijesh Pathak) భేటీ అయ్యారు. ఈటెల శామీర్ పేట్(Shameer Pet) నివాసంలో జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఈటెల రాజేందర్ కనపడుట లేదని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఈటెల రాజేందర్ దూరంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయగా.. అధిస్టానం ఈటెలను గట్టిగా మందలించినట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకు అధ్యక్ష పదవి మార్పు ఉండదని అధిస్టానం స్పష్టం చేయడంతో.. అలిగిన ఈటెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడనేది వార్తల సారాంశంగా తెలుస్తోంది. ఇటీవల కిషన్ రెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా ఈటెల డుమ్మా కొట్టాడంతో ఊహాగానాలు బలం చేకూరింది.
