కొన్ని సందర్భాలలో కోర్టు తీర్పులు విచిత్రంగా అనిపిస్తాయి. అసలే జీవితకాలం ఆసల్యం. ఆపై ఊహించనటువంటి తీర్పులు..

కొన్ని సందర్భాలలో కోర్టు తీర్పులు విచిత్రంగా అనిపిస్తాయి. అసలే జీవితకాలం ఆసల్యం. ఆపై ఊహించనటువంటి తీర్పులు.. ఇలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) జరిగింది. అక్కడి కమసిన్‌ పోలీస్‌స్టేషన్(Kamasin Police station) పరిధిలో 1994లో రామ్‌రూప్‌ శర్మ(Ram Rup sharma) అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. మద్యానికి అలవాటుపడిన ఆ ముగ్గురు రామ్‌రూప్‌ శర్మను ఓ గదిలో బంధించి దాడి చేశారు. డబ్బులు డిమాండ్‌ చేశారు. వారు అడిగిన మొత్తాన్ని సమర్పించుకుని బంధ విముక్తుడయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామ్‌ రూప్‌. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కానీ కోర్టులో మాత్రం ఈ కేసులు దశాబ్దాల తరబడి సాగింది. వందలసార్లు ఈ కేసు వాయిదా పడింది. ఈ క్రమంలోనే 15 మంది న్యాయమూర్తులు మారారు. రామ్‌రూప్‌ మాత్రం వెనుకంజ వేయలేదు. కోర్టులో పోరాడుతూనే వచ్చాడు. చివరకు మొన్న జూన్‌ 13వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని బండ కోర్టు తీర్పు చెప్పింది. ఈ దాడికి పాల్పడిన ముగ్గరులో ఇప్పటికే ఒకరు చనిపోయాడు. మిగతా ఇద్దరికి చెరో రెండు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. నేరస్తులైన నిందితులపై ఇప్పటికే అనేక కేసులలో నేరాలు రుజువయ్యాయని, ఈ చిన్న శిక్ష వారిపై ఎలాంటి ప్రభావం చూపదని బాధితులు ఎంత మొరపెట్టుకున్నా కోర్టు వినలేదు. ఘటన జరిగినప్పుడు బాధితుడి వయసు 40 ఏళ్లు. తీర్పు వచ్చినప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు.

Eha Tv

Eha Tv

Next Story