లవ్ జిహాదీ.. అంటే ఓ ముస్లిం అబ్బాయి స్నేహం పేరుతో హిందూ అమ్మాయితో పరిచయం పెంచుకుని, ఆపై దాన్ని ప్రేమగా మార్చేసుకుని, ఆనక పెళ్లి చేసుకుని, ఆటు పిమ్మట ఆ అమ్మాయి మతాన్ని మార్చడం.. ఓ పది పదిహేను ఏళ్ల నుంచి లవ్ జిహాదీ(Love Jihadi) పదం వినిపిస్తూ వస్తున్నది.
లవ్ జిహాదీ.. అంటే ఓ ముస్లిం అబ్బాయి స్నేహం పేరుతో హిందూ అమ్మాయితో పరిచయం పెంచుకుని, ఆపై దాన్ని ప్రేమగా మార్చేసుకుని, ఆనక పెళ్లి చేసుకుని, ఆటు పిమ్మట ఆ అమ్మాయి మతాన్ని మార్చడం.. ఓ పది పదిహేను ఏళ్ల నుంచి లవ్ జిహాదీ(Love Jihadi) పదం వినిపిస్తూ వస్తున్నది. రైట్ వింగ్ ఈ పదాన్ని బాగా పాపులర్ చేసింది. బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాలలో దీన్ని సీరియస్‌గా తీసుకుని, చట్టాలను కూడా రూపొందించారు. ఉత్తరప్రదేశ్‌లో మహ్మద్ అనీస్ అనే వ్యక్తి తన పేరును ఆకాశ్‌గా మార్చుకుని, ఓ దళిత హిందూ అమ్మాయితో స్నేహం చేసి, ఆమె మతం మార్చి ఆమె పేరును ఆయేషాగా మార్చేశాడు. ఇందుకో అత్యాచారం, బలవంత మత మార్పిడి కింద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఉత్తరప్రదేశ్ కోర్టు(Uttar Pradesh court) అతడికి చివరి శ్వాస ఉన్నంత వరకు జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు 4.56 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. మత మార్పిడి చట్టం కింద ఇదే మొదటి తీర్పు కావడం గమనార్హం.