ప్రముఖ నటి జయప్రదకు(Jayaprada) ఈఎస్‌ఐకి(ECI) సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్‌ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ రాంపుర్‌ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని(Election code) ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

టీడీపీతో(TDP) రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి రాంపుర్​ లోక్​సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు రాంపుర్​ ఎంపీగా ఉన్నారు. 2019లో బీజేపీలో చేరి రాంపుర్​ అభ్యర్థిగా పోటీ చేశారు.

Updated On 13 Feb 2024 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story