జ్ఞానవాపి మసీదులో గతంలో కోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేస్తుండగా అక్కడ ఓ శివలింగం లాంటి ప్రతిమ దొరికింది. దీని ఆధారంగా అక్కడ సర్వే నిర్వహించాలని, పూజలకు అనుమతి ఇవ్వాలని పలు హిందూ సంస్ధలు స్ధానిక వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు ఏఎస్ఐతో సర్వే చేయించేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై మసీదు కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తిరిగి అలహాబాద్ హైకోర్టులోనే విషయం తేల్చుకోవాలని వారికి సూచించింది.

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanavapi Masjid) అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. ఉత్తరప్రదేశ్ సీఎం(Uttar Pradesh CM) యోగి(Yogi) చేసిన సంచలన వ్యాఖ్యలతో జ్ఞానవాపి మరొకసారి దేశవ్యాపతంగా చర్చకు దారి తీసింది. మరో రెండు రోజులో కోర్ట్ తీర్పు నేపథ్యంలో యోగి చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు దారి తీసింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ యోగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, వాటిని ఇప్పుడు హిందువులుగా చెప్తున్న వారు పెట్టలేదని యోగీ తెలిపారు.

జ్ఢానవాపి మసీదుని ఇప్పుడు మసీదుగా పిలిస్తే తప్పవుతుందని, దీనికో పరిష్కారం ప్రభుత్వం కోరుకుంటుందని సీఎం యోగి తెలిపారు.
ముస్లింలు ఈ మసీదు విషయంలో చారిత్రక తప్పిదం చేశారని,దాన్ని సరిదిద్దడానికి ముందుకు రావాలని సూచించారు. జ్ఞానవాపి నిజంగానే మసీదు అయితే శివలింగం అక్కడ ఏం చేస్తుందని యోగీ ప్రశ్నించారు. దీంతో సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

జ్ఞానవాపి మసీదులో గతంలో కోర్టు ఆదేశాల మేరకు అధ్యయనం చేస్తుండగా అక్కడ ఓ శివలింగం లాంటి ప్రతిమ దొరికింది. దీని ఆధారంగా అక్కడ సర్వే నిర్వహించాలని, పూజలకు అనుమతి ఇవ్వాలని పలు హిందూ సంస్ధలు స్ధానిక వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు ఏఎస్ఐతో సర్వే చేయించేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై మసీదు కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తిరిగి అలహాబాద్ హైకోర్టులోనే విషయం తేల్చుకోవాలని వారికి సూచించింది.

సుప్రీంకోర్టు(Supreme court) ఆదేశాలతో అలహాబాద్ హైకోర్టును(High Court) మసీదు కమిటీ ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కట్టడానికి నష్టం కలగకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించగా సరైన సమాధానం ఏఎస్ఐ ఇవ్వలేదు. దీంతో విచారణ ముగించిన హైకోర్టు ఆగస్టు 3న తీర్పు ఇస్తామని ప్రకటించింది. మరో రెండు రోజుల్లో తీర్పు రానున్న నేపథ్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే యోగి కామెంట్స్ పై ఎంఐఎం(MIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసద్(MP Asad) మండి పడ్డారు. కోర్ట్ లో ఉన్న విషయాలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సీఎం యోగికి ఆయన సూచించారు. సీఎం యోగి చట్టాన్ని అనుచరించాలని కానీ యోగి మాత్రం ముస్లిమ్స్ పై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నారని అసద్ అన్నారు.

Updated On 1 Aug 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story