ఉత్తరప్రదేశ్ క్యాడర్(UttarPradesh Cadre)కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్(Abhishek Singh) తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయన తీసుకున్న నిర్ణయం అసాధారణమైనదేనని చెప్పాలి. ఆయనకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. ఆ మక్కువతోనే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మీరు విన్నది నిజమే.
ఉత్తరప్రదేశ్ క్యాడర్(UttarPradesh Cadre)కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్(Abhishek Singh) తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆయన తీసుకున్న నిర్ణయం అసాధారణమైనదేనని చెప్పాలి. ఆయనకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. ఆ మక్కువతోనే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఢిల్లీ క్రైమ్ రెండో సీజన్(Delhi Crime2)లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో అభిషేక్ సింగ్ చక్కగా నటించారు. గ్లామర్‌లో సినిమా హీరోలకు ఏ మాత్రం తీసిపోరు ఆయన! ఓటీటీలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ, ర్యాంప్‌ల మీద మోడల్‌గా దర్పం ఒలకబోస్తూ, కలెక్టర్ స్థాయి అధికారిగా ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో కొనసాగారు.2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు వివాదాలు ఆయన ఎదుర్కొన్నారు. 2015లో ఉత్తరప్రదేశ్ నుంచి డిప్యూటేషన్‌పై ఢిల్లీకి వెళ్లారు. గత ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Elections) పరిశీలకుడిగా అభిషేక్ వెళ్లారు. ఆ సమయంలో తాను ఎన్నికల పరిశీలకుడినని చెబుతూ ఓ ఫోటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇలా చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అందుకే ఎన్నికల కమిషన్ ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. సస్పెండ్ కూడా చేసింది. లేటెస్ట్‌గా ఆయన తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అభిషేక్ సతీమణి శక్తి నాగ్‌పాల్(Shakti Nagpal) కూడా ఐఏఎస్ అధికారి కావడం విశేషం. యమునా నగర్ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారామె!
కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో అభిషేక్ సమాజ సేవకుడిగా మారారు. ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చారు. అభిషేక్ సింగ్ మొదట ఓ షార్ట్ ఫిలింలో నటించారు. దాని పేరు చార్ పండ్రా. దీన్ని టీ సిరీస్ రూపొందించింది. పాటలో అభిషేక్ రొమాంటిక్ సైడ్‌ని చక్కగా ప్రదర్శించారు. విఫల ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచారు. నటుడిగా మంచి మార్కులు సంపాదించారు. అందుకు కారణం ఈ సాంగ్ తన నిజ జీవితంలోని సంఘటనలను బేస్ చేసుకుని తీసినట్లు అభిషేక్ చెప్పారు. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్ ట్రెండింగ్ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం మరో విశేషం.