ఈ రోజుల్లో బంధాలకు అర్థాలే మారిపోతున్నాయిది. అమ్మాయికి అమ్మాయితో, అబ్బాయికి అబ్బాయితో ఎఫైర్ ఉండటం సర్వసాధారణమైపోయింది. స్వలింగ సంపర్కుల(Same gender Love) ప్రేమలు, వారి వివాహాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో ఈ తరహా వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లింది.
ఈ రోజుల్లో బంధాలకు అర్థాలే మారిపోతున్నాయిది. అమ్మాయికి అమ్మాయితో, అబ్బాయికి అబ్బాయితో ఎఫైర్ ఉండటం సర్వసాధారణమైపోయింది. స్వలింగ సంపర్కుల(Same gender Love) ప్రేమలు, వారి వివాహాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో ఈ తరహా వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తన భర్తకు పంచాల్సిన ప్రేమ కాస్త తన ఆడపడుచుకు(sister-in-law) పంచింది. ఆమె కూడా తన వదినను ఇష్టపడటం ప్రారంభించింది. భర్త కంటే తన ఆడపడుచు దగ్గరే ఎక్కువ సుఖం దొరుకుతుందని ఆమెతో కలిసి రతి క్రీడల్లో(Romance) విహరించింది. అయితే ఓ సారి వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో 'వీరి సంబంధం బాంధవ్యం' కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే విడిపోవడానికి ఈ మహిళా ప్రేమికులు అంగీకరించలేదు. తాము కలిసి జీవిస్తామని.. కలిసి మరణిస్తామని.. మరదలితో తన బంధాన్ని తన భర్తతో సహా ఎవరూ విడదీయలేరని వివాహిత చెప్తోంది.
వీరి మధుర బాంధవ్యం గురించి వివాహిత తల్లిదండ్రులకు అత్తింటివారు చేరవేశారు. వివాహిత సోదరుడు వచ్చి ఇది సరైన వ్వవహారం కాదని నచ్చిజెప్పినా ఆమె వినలేదు. ఆమె సోదరుడు అక్కడి నుంచి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అయినా ఆమె తన ఆడపడుచుని విడిచి ఉండలేక తిరిగి అత్తారింటికి వెళ్లింది. అక్కడ వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఈ వ్యవహారం పోలీసులకు చేరింది. పోలీసులు విచారించగా తాము ఒకరిని, విడిచి ఒకరం ఉండలేమని అవసరమైతే చావనైనా చస్తాం కానీ తమ 'బంధాన్ని' వదులుకోలేమని తెగేసి చెప్పారు. ఇద్దరూ కలిసే జీవించాలనుకుంటుట్లు చెప్పారు. పోలీసులు కూడా ఈ ఇద్దరు స్వలింగ సంపర్కులకు కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. మరోవైపు వివాహిత అత్తామామలు కూడా తమ కూతురికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఈ అంశం కోడై కూస్తోంది.