పోతే పోయాడు లే! ఇంకొకరిని కట్టుకుందామని అనుకోలేదా ప్రేమికురాలు. వెంటాడి పట్టుకుంది. తన మెడలో తాళి కట్టించుకుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో ఈ సంఘటన జరిగింది. విషయమేమిటంటే.. ఇద్దరు రెండున్నరేళ్లు తెగ ప్రేమించేసుకున్నారు. ప్రేమించుకుంది చాల్లే అనుకుని ఇంట్లో వాళ్లకు ప్రేమ గురించి చెప్పుకున్నారు.
పోతే పోయాడు లే! ఇంకొకరిని కట్టుకుందామని అనుకోలేదా ప్రేమికురాలు. వెంటాడి పట్టుకుంది. తన మెడలో తాళి కట్టించుకుంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో ఈ సంఘటన జరిగింది. విషయమేమిటంటే.. ఇద్దరు రెండున్నరేళ్లు తెగ ప్రేమించేసుకున్నారు. ప్రేమించుకుంది చాల్లే అనుకుని ఇంట్లో వాళ్లకు ప్రేమ గురించి చెప్పుకున్నారు. వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. బరేలీలోని ఓ ఆలయంలో పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి కూతురు చక్కగా ముస్తాబయ్యి కూర్చుంది. ముహూర్తం వేళ దాటిపోతున్నా పెళ్లి కూమారుడి జాడ లేదు. పెళ్లి కూతురుకు కోపంతో కూడిన విసుగొచ్చేసింది. వెంటనే తన లవర్‌కు ఫోన్ చేసింది. అతగేమో తన తల్లిని తీసుకొచ్చేందుకు వెళుతున్నానని చెప్పాడు. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి డ్రామాలాడుతున్నాడనిపించింది పెళ్లి కూతురుకి! వెంటనే కుటుంబసభ్యులను వెంటేసుకుని అతడి కోసం బయల్దేరింది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భీమోరా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కుతుండగా అతడిని వెంబడించి మరీ పట్టుకుంది. ఇద్దరూ గట్టిగా తిట్టుకున్నారు. కాసేపయ్యాక చల్లబడ్డారు. చివరకు అతగాడిని పెళ్లి మండపానికి తీసుకొచ్చి ఇద్దరికి పెళ్లి చేశారు పెద్దలు!