ఎన్నికల(Elections) సమయంలో మన చూపుడువేలికి(Index finger) వేసే ఇంకు మార్క్‌ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే ఓ వారం పది రోజులు ఉంటుందంతే! పక్షం రోజుల కంటే ఎక్కువ ఉండటం అరుదు! కానీ తొమ్మిదేళ్లుగా ఆ సిరా గుర్తు(Sira Ink) అలాగే ఉన్నదంటే నమ్ముతారా? నమ్మితీరాలి. ఎందుకంటే ఈ సమస్య కారణంగానే ఉష అనే మహిళ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. కేరళలోని(Kerala) షోరనూర్‌లో గురువాయూరప్పన్‌ నగర్‌ ఉంది.

ఎన్నికల(Elections) సమయంలో మన చూపుడువేలికి(Index finger) వేసే ఇంకు మార్క్‌ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే ఓ వారం పది రోజులు ఉంటుందంతే! పక్షం రోజుల కంటే ఎక్కువ ఉండటం అరుదు! కానీ తొమ్మిదేళ్లుగా ఆ సిరా గుర్తు(Indelible Ink) అలాగే ఉన్నదంటే నమ్ముతారా? నమ్మితీరాలి. ఎందుకంటే ఈ సమస్య కారణంగానే ఉష అనే మహిళ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. కేరళలోని(Kerala) షోరనూర్‌లో గురువాయూరప్పన్‌ నగర్‌ ఉంది. అక్కడ 62 ఏళ్ల ఉష ఉంటున్నారు. రేపటి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లాలా? వద్దా? అన్న సంశయం పట్టుకుందామెకు. తనను ఓటు వేయనిస్తారో లేదో అన్న అనుమానం! కారణం 2016 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమె చేతి వేలికి వేసిన సిరా గుర్తు ఇంకా చెరిగిపోకుండా ఉండటమే! ఇప్పటికీ ఆమె వేలిపై గుర్తు కనిపిస్తుంటుంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కులపుల్లి ఏయూపీ స్కూల్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటేశారు. అప్పుడు వేసిన మార్క్‌ తొమ్మిదేళ్లు అవుతున్నా అలాగే ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఎన్నికల అధికారులు ఆమెను ఓటేయనివ్వలేదు. ఆమె ఎంతగా వివరణ ఇచ్చుకున్నప్పటికీ వినిపించుకోలేదు. చివరకు రాజకీయపార్టీలకు చెందిన ఏజెంట్లు ఆమెకు సపోర్ట్‌ ఇవ్వడంతో ఓటు వేయనిచ్చారు. సిరా గుర్తును తొలగించుకోవడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నో రకాల సబ్బులను వాడింది. రకరకాల ద్రవాకాలను ఉపయోగించింది. అయినా లాభం లేకపోయింది. పోలింగ్‌ కేంద్రంలో తనను అడ్డుకుంటారనే భయంతో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలప్పుడు ఓటు వేయలేదు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అంతే! ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీసీసీ ప్రధాన కార్యదర్శి టి.వై.షహబుద్దీన్‌కు తన బాధను వెలిబుచ్చుకున్నారు ఉష. ఆయన ఈ విషయాన్ని ఎన్నికల ఇన్‌ఛార్జ్‌కు చెప్పారు. వారు సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతో ఓటు వేయడానికి ఉష రెడీ అవుతున్నారు. ఎన్నికల సిరా ఇంత సుదీర్ఘ కాలం పాటు చెరగిపోకుండా ఉండటం ఇదే ప్రథమం అని, ఇలాంటి ఘటన మరెక్కడా జరగలేదని అధికారులు తెలిపారు. డెర్మటాలజిస్టులు ఇదే అంటున్నారు. అసలెందుకు సిరా గుర్తు చెరిగిపోవడం లేదో తెలుసుకోవడానికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని స్కిన్‌ స్పెషలిస్టులు చెబుతున్నారు.

Updated On 25 April 2024 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story