ఉన్నత విద్య(Higher Studies) కోసం అమెరికాకు(America) వెళ్లే విద్యార్థులకు కొత్త రూల్స్‌(Rules) పెట్టింది ఆ దేశం. వీసా(Visa) దరఖాస్తు చేసుకునేటపపుడు పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని మార్పులుచేసింది. ఈ నిబంధనలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఎఫ్‌, ఎం, జే(FMJ Visa) వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ సొంత పాస్‌పోర్టు(Passport Number) నంబర్‌తో ప్రొఫైల్‌(Profile) తయారు చేసి పంపాలని సూచించింది.

ఉన్నత విద్య(Higher Studies) కోసం అమెరికాకు(America) వెళ్లే విద్యార్థులకు కొత్త రూల్స్‌(Rules) పెట్టింది ఆ దేశం. వీసా(Visa) దరఖాస్తు చేసుకునేటపపుడు పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని మార్పులుచేసింది. ఈ నిబంధనలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఎఫ్‌, ఎం, జే(FMJ Visa) వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ సొంత పాస్‌పోర్టు(Passport Number) నంబర్‌తో ప్రొఫైల్‌(Profile) తయారు చేసి పంపాలని సూచించింది. తప్పుడు పాస్‌పోర్టు నంబర్‌ సమర్పిస్తే మాత్రం అప్లికేషన్‌ను రిజెక్ట్‌ చేయడంతో పాటు డిపాజిట్‌ చేసిన సొమ్మును(Deposit Amount) కూడా వాపస్‌ ఇవ్వబోమని స్పష్టం చేసంది. ఎఫ్‌, ఎం వీసా కోసం దరఖాస్తు చేసేవాళ్లు ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌(Exchange visitor Program), స్టూడెంట్‌ సర్టిఫైడ్‌(Student Certified Program) ప్రోగ్రాంలో తప్పనిసరిగా ఎన్‌రోల్‌ చేసుకోవాలని అమెరికా కాన్సులేట్‌ తెలిపింది. జే వీసాకు దరఖాస్తు చేసేవాళ్లు అమెరికా విదేశాంగశాఖ గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ పొంది ఉండాలని, వీసా అపాయింట్‌మెంట్‌ కోసం ఇప్పటికే ప్రొఫైల్‌ సిద్ధం చేసుకొన్నవారు తమ పాస్‌పోర్ట్‌ అసలైన నంబర్‌తో ఆ దరఖాస్తులను అప్‌డేట్‌ చేసుకోవాలని యుఎస్‌ కాన్సులేట్‌ సూచించింది.

Updated On 1 Dec 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story