బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదాస్పద ప్రకటనతో భారత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉభయ సభల్లో బాలికల విద్య, జనాభా నియంత్రణపై మాట్లాడుతున్న సమయంలో నితీష్ కుమార్ నోటి నుంచి వ‌చ్చిన ప‌లు అంశాలు కలకలం సృష్టించాయి.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) వివాదాస్పద ప్రకటనతో భారత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉభయ సభల్లో బాలికల విద్య, జనాభా నియంత్రణపై మాట్లాడుతున్న సమయంలో నితీష్ కుమార్ నోటి నుంచి వ‌చ్చిన ప‌లు అంశాలు కలకలం సృష్టించాయి. బీహార్(Bihar) ముఖ్యమంత్రి తన ప్రకటనతో దేశవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నారు, కానీ విషయం ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం భారత్ సరిహద్దు దాటి విదేశాలకు చేరింది. హాలీవుడ్ గాయని మేరీ మిల్బెన్(Mary Millben) నితీష్ కుమార్‌ను మందలిస్తూనే భారతీయ జనతా పార్టీ(BJP)కి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర అసెంబ్లీలో నితీష్ కుమార్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై పలు విమర్శలు వస్తున్నాయి. నితీష్ కుమార్ పై దేశప్రజలతో పాటు విదేశీయులలో కూడా ఆగ్రహం పెరుగుతోంది. ఆఫ్రికన్-అమెరికన్ నటి, గాయని మేరీ మిల్బెన్.. బీహార్‌లో నాయకత్వం వహించడానికి ఒక మహిళకు అధికారం ఇవ్వాలని మిల్బెన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని అభ్యర్థించారు.

మేరీ మిల్బెన్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. 'నితీష్ కుమార్ వ్యాఖ్యల తర్వాత, ధైర్యంగల మహిళ ముందుకు వచ్చి బీహార్ ముఖ్యమంత్రి పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని నేను నమ్ముతున్నాను. నేను భారత పౌరురాలిని అయితే.. నేను బీహార్ వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేస్తాను. బీహార్‌లో నాయకత్వానికి భాజపా మహిళకు సాధికారత కల్పించాలి. ప్రతిస్పందనగా మహిళా సాధికారత, అభివృద్ధికి ఇది నిజమైన స్ఫూర్తి అవుతుంది. లేదంటే జవాన్ లో షారుక్ హెచ్చరించినట్లు 'ఓటు వేసి మార్పు తీసుకురా అని రాసుకొచ్చారు.

జనాభా నియంత్రణలో విద్య, మహిళల పాత్రను వివరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో కించపరిచే పదజాలాన్ని ప్రయోగించడం వివాదాస్పదమైంది. బీహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. జనాభా పెరుగుదలకు చెక్ పెట్టేందుకు బాలికల విద్య ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రి తప్పుడు వ్యాఖ్య చేశారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో నితీష్ కుమార్ బుధవారం క్షమాపణలు చెప్పి తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.

Updated On 8 Nov 2023 8:34 PM GMT
Yagnik

Yagnik

Next Story