Jeo Bidden Memory : జో బైడెన్ జ్ఞాపకశక్తి బాగా తగ్గింది... గాజా నగరం మెక్సికో సరిహద్దులో ఉందనేశారు!
అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌కు(Jeo Bidden) అల్జీమర్స్ వచ్చినట్టుగా ఉంది. ఆయన జ్ఞాపకశక్తి(Memory Power) బాగా తగ్గింది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. లైవ్‌లో ఆయన మాట్లాడిన మాటలు విని అమెరికా ప్రజలు బిత్తరపోయారు. ఆయన ఉద్దేశంలో గాజా(Gaza) నగరం మెక్సికోలో(Mexico) ఉంది. ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మాట అనడంతో విలేకర్లు ఆశ్చర్యపోయారు. దేశ రహస్య పత్రాలను బైడెన్ తన ఇంట్లో పెట్టుకోవడంపై స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ హుర్(Robert Hurr) నివేదిక ఇచ్చారు.
అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌కు(Jeo Bidden) అల్జీమర్స్ వచ్చినట్టుగా ఉంది. ఆయన జ్ఞాపకశక్తి(Memory Power) బాగా తగ్గింది. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. లైవ్‌లో ఆయన మాట్లాడిన మాటలు విని అమెరికా ప్రజలు బిత్తరపోయారు. ఆయన ఉద్దేశంలో గాజా(Gaza) నగరం మెక్సికోలో(Mexico) ఉంది. ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మాట అనడంతో విలేకర్లు ఆశ్చర్యపోయారు. దేశ రహస్య పత్రాలను బైడెన్ తన ఇంట్లో పెట్టుకోవడంపై స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ హుర్(Robert Hurr) నివేదిక ఇచ్చారు. 81 ఏళ్ల వయసున్న బైడెన్ జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉందని, కొడుకు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయాడో కూడా ఆయనకు గుర్తు లేదని చెప్పింది. వైస్ ప్రెసిడెంట్‌గా ఎప్పుడు పని చేశాడో కూడా ఆయనకు జ్ఞప్తికి లేదని తెలిపింది. రాబర్ట్ హుర్ ఇచ్చిన నివేదికపై జో బైడెన్ ప్రెస్ మీట్ పెట్టారు. హుర్ నివేదికను తిట్టిపోశారు. తనకు అన్ని చక్కగా గుర్తుంటాయని, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మంచి పనులు చేశానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో గాజాకు మానవీయసాయం పంపడంపై బైడెన్‌ను విలేకర్లు ప్రశ్నించారు. దానికి సమాధానం చెబుతూ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసిని మెక్సికో అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ‘మీకు ముందే తెలుసు. మెక్సికో అధ్యక్షుడు ఎల్ సిసి సరిహద్దులు తెరిచి (అంటే గాజా సరిహద్దన్నమాట) మానవీయ సాయం పంపేందుకు ఇష్టపడలేదు. నేను ఆయనతో మాట్లాడి గేట్లు తెరిపించాను’ అని బైడెన్ చెప్పారు. బైడెన్ చెప్పింది విన్న విలేకర్లు ఆశ్చర్యపోయారు. అయితే బైడెన్ చేసిన పొరపాట్లను తర్వాత అధ్యక్ష బృందం సరిదిద్దింది.