యూపీఎస్‌సీ(UPSC) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన ఇషితా కిశోర్(Ishitha Kishore) మొదటి ర్యాంకును సాధించారు. తెలంగాణకు చెందిన ఎన్.ఉమా హారతి(N.Uma Harathi) మూడో ర్యాంకును సాధించారు.

UPSC 2022 Top Rankers
యూపీఎస్‌సీ(UPSC) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన ఇషితా కిశోర్(Ishitha Kishore) మొదటి ర్యాంకును సాధించారు. తెలంగాణకు చెందిన ఎన్.ఉమా హారతి(N.Uma Harathi) మూడో ర్యాంకును సాధించారు. మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి నారాయణపేట(Narayana Pet) ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు(SP N.Venkateshwar Rao) కూతురు. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట(Suryapet) జిల్లాలోని హుజూర్‌నగర్. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది సివిల్స్‌కు ఎంపిక కావడం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్(Sri Sai Harshith) 40వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.
బీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు, హెచ్.ఎస్. భావనకు 55, సాయి ప్రణవ్‌కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చల్లా కళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్ట్ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించింది. 933 మందిని ఎంపిక చేసింది.
