దసరా(Dasara) పండుగ రోజున రావణాసుడి(Ravanvadh) బొమ్మను దగ్ధం చేయడం ఆనవాయితీ!

దసరా(Dasara) పండుగ రోజున రావణాసుడి(Ravanvadh) బొమ్మను దగ్ధం చేయడం ఆనవాయితీ! ఢిల్లీలోని(Delhi) రామ్‌లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. చెడును నాశనం చేయడమే ఇందులోని పరామర్థం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. తనను వదిలేసిన భర్త, అత్తింటివారి దిష్టిబొమ్మలను( effigies) దసరా రోజున వారి ఇంటి ముందే దహనం చేసింది. వారు సామాజిక రావణాసురులని ఆమె చెబుతోంది. ప్రభుత్వం భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకుని, తనకు తగు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శనివారం దసరా పండుగ సందర్భంగా ప్రియాంక అనే మహిళ ముస్కరాలోని తన భర్త, అత్తమామల ఇంటి ముందు వారి ఫొటోలతో కూడిన మూడు దిష్టి బొమ్మలను ఏర్పాటు చేసింది. వారు సామాజిక రావణాసురులని చెబుతూ వాటిని దహనం చేసింది. చెడు గుణాలు ఉన్న అలాంటి వారిని తిరస్కరించాలని, కాల్చివేయాలని సమాజానికి సందేశం ఇచ్చింది. 14 ఏళ్ల కిందట సంజీవ్‌ దీక్షిత్‌, ప్రియాంక వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే సోదరి స్నేహితురాలైన పుష్పాంజలితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి తర్వాత తనను వదిలేసి ఆమెతో కలిసి ఉంటున్నాడని చెప్పింది. అత్తమామలు కూడా తనకు అండగా నిలబడలేదని ఆవేదన చెందింది. 14 ఏళ్లుగా న్యాయం కోసం తాను పోరాడుతూనే ఉన్నానని చెప్పింది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరింది. భర్త, అత్తమామల ఫోటోలున్న దిష్టిబొమ్మలను ఆమె దహనం చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On 15 Oct 2024 7:43 AM GMT
Eha Tv

Eha Tv

Next Story