ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) వీరబహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీకి(Veera Bahadur Singh Purvanchal University) చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం బట్టబయలు అయ్యింది. డీఫార్మసీ(D Pharmacy) పరీక్షలో జైశ్రీరామ్(Jai sriram) అనే నినాదాలు, క్రికెటర్ల(Cricketers) పేర్లు రాసిన చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Jai Shree Ram Slogan
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) వీరబహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీకి(Veera Bahadur Singh Purvanchal University) చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం బట్టబయలు అయ్యింది. డీఫార్మసీ(D Pharmacy) పరీక్షలో జైశ్రీరామ్(Jai sri ram) అనే నినాదాలు, క్రికెటర్ల(Cricketers) పేర్లు రాసిన చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో కొందరికి ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా వచ్చాయి. ఆర్టీఐ(RTI) దరఖాస్తు ద్వారా కొన్ని సమాధాన పత్రాలను పరిశీలిస్తే ఈ బండారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని ఈ పని చేశారు. వారిద్దరిని సస్పెండ్ చేసింది యూనివర్సిటీ!
